Off The Record: తెలంగాణలో బీజేపీ ప్రస్తావన లేకుండా మిగతా పార్టీలు పొలిటికల్ స్టేట్‌మెంట్ ఇవ్వలేని పరిస్థి వచ్చిందా? మీతో దోస్తీ అంటే… మీతోనే దోస్తీ అంటూ… కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పరస్పరం విమర్శించుకుంటూ… బీజేపీ గురించి మాట్లాడకుండా ఉండలేకపోతున్నాయా? తెలంగాణ కమలనాథులు దీన్ని తమ బలంగా ఫీలవుతున్నారా? కాషాయం కేంద్రంగా తెలంగాణ రాజకీయం ఎలా టర్న్ అవుతోంది?
నేను మోనార్క్‌ని… నన్ను ఎవరూ మోసం చేయలేరన్నట్టుగా…. మేం ముఖ్యమైన వాళ్ళం. ఇప్పుడు మేం లేకుండా ఎవరూ రాజకీయం చేయలేరని అంటున్నారట తెలంగాణ బీజేపీ లీడర్స్. ఇటు అధికార కాంగ్రెస్ అయినా… అటు ప్రతిపక్ష బీఆర్‌ఎస్ అయినా… తమ ప్రస్తావన లేకుండా రాజకీయం చేయలేని పరిస్థితి ఏర్పడిందని, ఇద్దరూ మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారంటే… రాష్ట్రంలో పుంజుకుని కీలకంగా మారినట్టే కదా అని అంటున్నారట. ఒక విధంగా తమకు ఇది మంచి పరిణామమే అన్నది కమలం నేతల ఉద్దేశ్యం అట. తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ క్రియాశీలక స్థాయికి చేరిందనడానికి ఇదే నిదర్శనమని అంటున్నట్టు తెలిసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ లేకుండా తెలంగాణ రాజకీయాలు లేవని కమలనాధులు ఉబ్బి తబ్బిబ్బవుతున్నట్టు సమాచారం. జాతీయ వ్యవహారాల సంగతి పక్కనబెడితే… తెలంగాణకు వచ్చేసరికి ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. అదే సమయంలో… మాకు ప్రాంతానికో నీతి, రాష్ట్రానికో రీతి ఉండదు… మేం మేమే… ఆ మాటకొస్తే… బీఆర్‌ఎస్సే… బీజేపీకి బీ టీమ్ అంటున్నారు కాంగ్రెస్ లీడర్స్. ఇలా రెండు పార్టీలు తమను తల్చుకోకుండా ఉండలేకపోతున్నాయని, ఇది ప్లస్సేనన్నది బీజేపీ లీడర్స్ ఆలోచనగా చెప్పుకుంటున్నారు.
అసలు బీజేపీ.. కాంగ్రెస్ఎలా కలుస్తాయన్నది వాళ్ళ క్వశ్చన్. BRS నేతల ఆరోపణల్లో అర్థం లేదని, గతంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కలిసి పోటీ చేసిన విషయాన్ని.. కేంద్ర, రాష్ట్ర మంత్రి వర్గాల్లో రెండు పార్టీలు కలిసి పని చేసిన విషయాన్ని మర్చిపోతే ఎలాగని అంటున్నారు బీజేపీ నాయకులు. ఇక ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ భవిష్యత్‌లో కలిసి పని చేసినా ఆశ్చర్యం లేదన్నది బీజేపీ వెర్షన్. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ ఏమో… బీఆర్‌ఎస్.. బీజేపీ ఒకటేనని అంటుంది… బీఆర్‌ఎస్ ఏమో.. కాంగ్రెస్, బీజేపీ ఒకటని అంటుంది. ఇక బీజేపీ ఏమో… కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒకటని అంటుంది. అసలింతకీ ఎవరితో ఎవరికి సంబంధాలున్నాయి? ఒకవేళ ఉంటే అవి అక్రమమా, సక్రమమా అంటూ జుట్టు పీక్కుంటున్నారట పొలికల్ పండిట్స్. ఎవరికి వారు తమ వాదనకు బలాన్నిచ్చేలా జరుగుతున్న పరిణామాలను ఉదాహరణగా చెబుతుండటంతో గందరగోళం మరింతగా పెరుగుతోందని అంటున్నారు. అటు మూసీగాని, ఇటు లగచర్ల ఉదంతంగానీ మేటర్ ఏదైనా… ఎవరు ఎవర్ని రక్షిస్తున్నారన్న డౌట్స్‌తో మొత్తం కన్ఫ్యూజ్ క్రియేట్ అవుతోందని అంటున్నారు పరిశీలకులు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అయితే… బీజేపీ,బీఆర్‌ఎస్ ఒకటేనన్న అభిప్రాయం ప్రజల్లోకి బలంగా వెళ్ళిందని అంటున్నారు. ఈ గందరగోళానికి తెర దించాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందేనన్నది రాజకీయ వర్గాల విస్తృతాభిప్రాయం.