Exit Polls: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి సత్తా చాటబోతున్నట్లు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైంది.
మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్ అంచనా:
మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ సీట్లు ఉంటే, మెజారిటీకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 145. అయితే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. మహయుతి కూటమి( బీజేపీ-ఏక్‌నాథ్ షిండే- అజిత్ పవార్ ఎన్సీపీ) సగటున 182 (175-195) స్థానాలు కైవసం చేసుకుంటుందని, అదే సమయంలో మహా వికాస్ అఘాడీ( కాంగ్రెస్-ఉద్ధవ్ ఠాక్రే-శరద్ పవార్ ఎన్సీపీ) 97 (85-112), ఇతరులు 9(7-12) స్థానాలు సాధిస్తాయని వెల్లడించింది.
* మహారాష్ట్రలో 113 (102-120) సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉంది.
* శివసేన(ఏక్‌నాథ్ షిండే) పార్టీ 52(42-61), ఎన్సీపీ అజిత్ పవార్ 17(14-25) స్థానాలు సాధించే అవకాశం ఉంది.
* కాంగ్రెస్ 35(24-44), శివసేన (యూబీటీ) 27 (21-36), ఎన్సీపీ (శరద్ పవార్) 35 (28-41) స్థానాలు సాధిస్తాయని ఎగ్జిట్ పోల్ సర్వే అంచనా వేశాయి.
* మహాయుతి 49.8 శాతం, మహావికాస్ అఘాడీ 40.1 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది.
* పార్టీల వారీగా ఓట్ల శాతాన్ని చూసుకుంటే.. బీజేపీ 31.3%, శివసేన ( ఏక్‌నాథ్ శిండే) 14.5%, ఎన్సీపీ (అజిత్ పవార్) 4% ఓట్లు పొందే అవకాశం ఉంది
* కాంగ్రెస్ 13.7%, శివసేన (యూబీటీ) 13%, ఎన్సీపీ (శరద్ పవార్) 10.1%, ఇతరులు 13.4% ఓట్లు పొందే అవకాశం ఉంది.
* ముఖ్యమంత్రి ప్రాధాన్యతలో ఏక్‌నాథ్ షిండేకు 35.8 శాతం, ఉద్దవ్ ఠాక్రేకు 21.7%, దేవంద్ర ఫడ్నవీస్‌కు 11.7%, రాజ్‌ఠాక్రేకు 2.9%, అజిత్ పవార్‌కు 2.3%, జయంత్ పాటిల్‌కు 2.1%, నానా పటోలేకు 1.3%, ప్రకాశ్ అంబేద్కర్‌కు 1.3% మద్దతు లభించింది
* ఎంఐఎం, వీబీఏ, బీవీఏ, ఎమ్ఎన్ఎస్ వంటి చిన్న పార్టీలు సీట్లు సాధించడంలో వెనకబడినా, గణనీయంగా ఓట్లను చీల్చగలిగాయి.
* రైతులు, ప్రైవేట్ ఉద్యోగులు, వ్యాపారస్తులు, గృహిణులు మహాయుతి వైపు ఉండగా, ప్రభుత్వ ఉద్యోగులు మహా వికాస్ అఘాడీకి మద్దతు నిలిచారు.
* లడ్కీ బహన్ యోజన పథకం మహాయుతికి ప్లస్ అయింది.
* లోక్‌సభ ఎన్నికల్లో విదర్భ, ముంబాయి ప్రాంతాల్లో కాంగ్రెస్ ఆధిక్యత సాధించినా, అసెంబ్లీ ఎన్నికల నాటికి పరిస్థితులు మారడంతో మహాయుతికి అవకాశాలు మెరుగయ్యాయి
* బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ ఈ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో ప్రచారం చేయడం మహాయుతికి తోడ్పడింది.
జార్ఖండ్ ఎగ్జిట్ పోల్స్ అంచనా:
జార్ఖండ్‌లో కూడా బీజేపీ జయకేతనం ఎగరేయబోతోంది. జార్ఖండ్‌లో ఎన్డీయే కూటమి అధికారం చేపట్టే అవకాశం ఉంది. మొత్తం 81 స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు జరిగాయి. అధికారం చేపట్టాలంటే మ్యాజిక్ ఫిగర్ 41.
* ఎన్డీయే కూటమిలో బీజేపీ 42-48 స్థానాలు, మిత్ర పక్షం ఏజెఎస్‌యూ 2-5 స్థానాలు గెలిచే అవకాశం ఉంది.
* ఇండియా కూటమిలో జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) 16-23, కాంగ్రెస్ 8-14 గెలిచే అవకాశం ఉంది.
* ఇతరులు 6-10 చోట్ల విజయం సాధించవచ్చు.
* బీజేపీ 42.1%, ఏజేఎస్‌యూ 4.6%, కాంగ్రెస్ 16.2%, జేఎమ్‌ఎమ్ 20.8 %, ఇతరులు 16.3% ఓట్లు పొందే అవకాశం ఉంది.
* ఎస్సీలు, ముస్లింలు, క్రిస్టియన్లు ఈ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి వైపు నిలిచారు.
* ఈ ఎన్నికల్లో అగ్రవర్ణాలు, ఓబీసీలు ఎన్డీయేకు అనుకూలంగా ఉన్నారు.
* బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల అంశాన్ని బీజేపీ ప్రధాన ప్రచార అంశంగా మార్చుకోవడం ఎన్డీయేకు సానుకూలంగా మారింది.
* మహిళలు ఇండియా కూటమి వైపు మొగ్గు చూపేందుకు ‘మాయి యోజన’ పథకం తోడ్పడింది.
* కూటమిలో సీట్ల పంపంకంతో పాటు అభ్యర్థుల ప్రకటన, పోల్ మేనేజ్‌మెంట్‌లో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో ఎన్డీయేకు సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి.