బీఆర్ఎస్ హయాంలో మహబూబాబాద్‌లో గిరిజనుల నుంచి బలవంతంగా లాక్కున్న భూములను వారికి తిరిగి ఇచ్చిన తర్వాతనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహబూబాబాద్‌కు రావాలని ఎంపీ బలరాంనాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ.. లగచర్ల ఘటన బీఆర్ఎస్ పార్టీ కుట్రతో చేయించిందని.. అందులో ఏడుగురికి భూములు లేవని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ దళితుడిని సీఎం చేయలేదని.. 3 ఎకరాల భూమిని ఇవ్వలేదని, కేజీ టు పీజీ ఉచిత విద్యను అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో గిరిజనులపై ఎన్నో దాడులు జరిగాయని.. ఖమ్మంలో గిరిజన రైతులకు సంకెళ్లు వేశారని.. సిరిసిల్లలో ఇసుక ట్రాక్టర్లతో దళితులను హతమార్చారని, ఎల్బీ నగర్‌లో ఆరు సంవత్సరాల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారని, హుజూర్ నగర్‌లో ప్రస్తుత జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ పై దాడి చేశారని గుర్తు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు గిరిజనులు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. కేటీఆర్ భయానికి సినిమా హీరోయిన్లు ముంబైకి పారిపోతున్నారని అన్నారు.
Read Also: Raghuram rajan: ప్రభుత్వ రుణాలు చాలా ప్రమాదకరం
అనంతరం ఎమ్మెల్యే డాక్టర్. మురళి నాయక్ మాట్లాడుతూ… రేపు బీఆర్ఎస్ ధర్నాకు కేటీఆర్ వస్తే దగాపడ్డ గిరిజనులంతా తరిమి తరిమి కొడతారని అన్నారు. ఇందిరా గాంధీ గిరిజనులకు భూములను పంపిణీ చేస్తే.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ భూములను బలవంతంగా లాక్కొని కనీసం నష్టపరిహారం కూడా చెల్లించలేదని తెలిపారు. భూములను లాక్కోవద్దని గిరిజన మహిళలంతా కాళ్ళ మీద పడ్డ కనికరించలేదని.. 30 కుటుంబాలను బజారుకు ఈడ్చారని, గిరిజనులకు నష్ట పరిహారం చెల్లించలేదని, ఆరోజు గిరిజనులు కనపడలేదా అని ప్రశ్నించారు. హైదరాబాద్ చుట్టూ అభివృద్ధి కేంద్రీకృతం కాకుండా కొడంగల్‌లో ఫార్మ పరిశ్రమకు కృషి చేస్తుంటే, బీఆర్ఎస్ కుట్రతో అధికారులపై దాడులకు పాల్పడ్డారని.. లగచర్ల రైతులకు నష్టపరిహారం చెల్లించడంతో పాటు, కుటుంబానికో ఉద్యోగం ఇస్తామని చెప్పామని అన్నారు.
Read Also: Hair dryer blast: హెయిర్ డ్రైయర్ పేలి చేతులు కోల్పోయిన మహిళ..