Jharkhand And Maharashtra Elections 2024 Live UPDATES: ఈరోజు మహారాష్ట్ర అసెంబ్లీకి 288 సీట్లతో పాటు జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశలో భాగంగా 38 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతుంది. ఇక, గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు, అగ్రనేతల కొద్ది కాలంగా హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరోవైపు ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, కేరళలోనూ మరో 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. లైవ్ అప్‌డేట్స్ మీ కోసం..
సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్.. ఓటరు కార్డులు, ఆధార్ ఐడీలను తనిఖీ చేస్తున్న పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని పిటిషన్. ఆధార్ గుర్తింపు కార్డు లేదా గుర్తింపు కార్డును తనిఖీ చేసే హక్కు పోలీసులకు లేదు- అఖిలేస్ యాదవ్
కేరళలోని పాలక్కాడ్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్.. 184 పోలింగ్ కేంద్రాల్లో ఓటేస్తున్న ప్రజలు..
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమైన తొలి గంటలోనే పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
బారామతిలోని పోలింగ్ కేంద్రంలో ఎన్సీపీ (ఎస్పీ) నాయకురాలు, పార్లమెంట్ సభ్యురాలు సుప్రియా సూలే తన కుటుంబంతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహారాష్ట్రలో ఇండియా కూటమి ప్రభుత్వం త్వరలో ఏర్పడబోతుందని వెల్లడి
నాగ్‌పుర్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఓటు వేశారు.
బారామతిలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ అభ్యర్థి అజిత్ పవార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలో మరోసారి మహాయుతి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లోని ఓటర్లు.. ముఖ్యంగా మహిళలు, యువకులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విజ్ఞప్తి చేశారు.
సీఎం యోగి ఆదిత్యనాథ్ పోలీసులు ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోకుండా అడ్డుకుంటున్నారు.. పురుష ఓటర్లను కొట్టడం, మహిళలను అసభ్య పదజాలంతో దూషించడంతో వారు తిరిగి ఇంటికి వెళ్లిపోతున్నారని ఆరోపించింది. ఎన్నికల సంఘం, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కలిసి రచిస్తున్న ప్రజాస్వామ్యంలో చీకటి ఒప్పందం- సమాజ్‌వాది పార్టీ
ముంబైలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రంలో ఏర్పాట్లు చాలా బాగున్నాయి.. ఎన్నికల సంఘాన్ని అభినందిస్తున్నాం.. ఈసారి ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది.
బాలీవుడు నటుడు అక్షయ్ కుమార్ తన ఓటును వినియోగించుకున్నారు. ముంబైలోని పోలింగ్ బూత్‌లో ఓటేశారు. ఇక్కడ సీనియర్ సిటిజన్ల కోసం ఏర్పాట్లు చాలా బాగా చేశారు.. అందరూ బయటకు వచ్చి ఓటు వేయాలని కోరుకుంటున్నాను- అక్షయ్ కుమార్
#WATCH | Mumbai: Actor Akshay Kumar shows his inked finger after casting his vote for #MaharashtraAssemblyElections2024
He says "The arrangements here are very good as I can see that arrangements for senior citizens are very good and cleanliness has been maintained. I want… pic.twitter.com/QXpmDuBKJ7
— ANI (@ANI) November 20, 2024
భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను గత కొంతకాలంగా భారత ఎన్నికల సంఘంకి ఐకాన్‌గా ఉన్నాను.. ప్రతి ఒక్కరు ఓటు వేయాలని మెసేజ్ ఇచ్చారు. ఇది మన బాధ్యత.. అందరూ బయటకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసిన సచిన్.
జార్ఖండ్, మహారాష్ట్రలోని పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా భద్రత.. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కఠిన ఆంక్షలు.. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ అమలు.
తెలంగాణలోని కొమురం భీమ్ ఆసిపాబాద్ జిల్లాలోని కెరిమెరి మండలంలోని 12 గ్రామల ప్రజలకు మహారాష్ట్రలోనూ ఓటు హక్కు ఉంది. పరందోళి, గౌరి, పద్మావతి, ముక్దంగూడ, ఇందిరానగర్, శంకర్ లొద్ది, మహారాజ్ గూడ, అంతాపూర్ ప్రజలకు రాజుగాని నియోజకవర్గంలో ఓటు హక్కు ఉంది. ఈ గ్రామాల్లో 3 వేలకు పైగా ఓటర్లు ఉన్నారు.. కాగా, రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దుగా ఉన్న కెరిమెరి మండలం ఎప్పటి నుంచో వివాదంలో ఉంది.
జార్ఖండ్ లో కొనసాగుతున్న రెండో విడత ఎన్నికల పోలింగ్.. 38 నియోజకవర్గాలకు బరిలో 582 మంది అభ్యర్థులు.. 14,218 పోలింగ్ కేంద్రాల దగ్గర భద్రత కట్టుదిట్టం..
జార్ఖండ్ 38 స్థానాలకు రెండో దశలో ఓటింగ్.. ఎన్నికల బరిలో మొత్తం 528 మంది అభ్యర్థులు.. 472 మంది పురుషులు, 55 మంది మహిళలు, ఒక థర్డ్ జెండర్.
మహారాష్ట్ర, జార్ఖండ్ లతో పాటు మరో ఐదు రాష్ట్రాల్లోని 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు కూడా నేడు పోలింగ్.. ఈ 15 సీట్లలో 9 ఉత్తరప్రదేశ్‌లో ఉత్తరాఖండ్ నుంచి 1, పంజాబ్ నుంచి 4, కేరళ నుంచి 1 ఉన్నాయి. మహారాష్ట్రలోని నాందేడ్ లోక్‌సభ స్థానానికి కూడా ఉప ఎన్నికలు జరుగుతుంది.
మహారాష్ట్రలో మొత్తం పోలింగ్ కేంద్రాలు మొత్తం 100186 ఉన్నాయి. అందులో రూరల్ – 57582, అర్బన్- 42604, మోడల్ బూత్‌లు- 633, మహిళలు నిర్వహిస్తున్న బూత్‌లు- 406, వికలాంగులు నిర్వహిస్తున్న బూత్‌లు- 274, వెబ్‌కాస్టింగ్- 67557 ఉన్నాయి
పురుషులు- 5 కోట్లు, స్త్రీలు- 4.69 కోట్ల మంది, థర్డ్ జెండర్- 6101 ఉండగా.. 18-19 వయస్సు ఓటర్లు (తొలిసారి ఓటరు)- 22.2 లక్షలు, వికలాంగులు- 6.41 లక్షలు, 100+ ఓటర్లు- 47392 మంది ఉన్నారు.
మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు.. జార్ఖండ్‌లో మలివిడతలో 38 స్థానాలు సహా మరో నాలుగు రాష్ట్రాల్లోని 15 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్
మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో ప్రారంభమై పోలింగ్.. పటిష్ట ఏర్పాట్లు చేసిన ఎన్నికల కమిషన్..