AAP : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్‌కు చెందిన వీర్‌సింగ్ ధింగన్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వీర్ సింగ్ దింగన్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు.
Liquor Shops Closed: మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్. ఎక్సైజ్ అధికారుల దోపిడిని ఆరికట్టాలంటూ కన్నడ రాష్ట్రంలో లిక్కర్ షాప్స్ ఓనర్స్ ఆందోళన బాట పట్టబోతున్నారు. ఈ సందర్భంగా కర్ణాటకలోని మద్యం దుకాణాలు నవంబరు 20వ తేదీన మూత పడబోతున్నాయి.
Revanth Reddy: ప్రజాపాలన- విజయోత్సవాలపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం ముగిసింది. డిసెంబర్ 9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలపై చేపట్టే కార్యక్రమాలను సీఎంకు అధికారులు వివరించారు.
Maoist Party: వికారాబాద్ జిల్లాలోని లగచర్లలో దాడి ఘటనపై మావోయిస్టులు సంచలన లేఖ విడుదల చేశారు. అందులో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న విధ్వసం, అప్రజాస్వామిక పాలన కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనో బాధ్యత రాహిత్యం వలనో జరుగుతున్నది కాదు అని తెలిపారు.
Congress: రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఇబ్బడిముబ్బడిగా హామీల వర్షం కురిపించింది. అయితే, ఇప్పుడు ఈ హామీల వల్ల ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు కొత్త పన్నులు విధించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. కర్ణాటక సర్కార్ ప్రతిపాదించిన ‘‘గ్రీన్ సెస్’’ ముసాయిదా రూపొందించకముందే రాజకీయంగా కాంగ్రెస్ ఇబ్బందుల్లో పడింది.
జార్ఖండ్‌లో తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రెండో దశ ఎన్నికల పోలింగ్ కోసం జోరుగా ప్రచారం సాగుతోంది. ఫస్ట్ ఫేజ్‌లో 66 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. రెండో దశ ఓటింగ్ నవంబర్ 20న జరగనుంది.
వచ్చే ఏడాదే దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి కొత్త ఊపు వచ్చింది. ఆప్ అభ్యర్థి మహేశ్‌కుమార్ ఖిచి జయకేతనం ఎగరేశారు.
నిజంగా లగచర్లలో మేము కుట్ర చేసినట్లైతే మీడియా వాళ్లు వెళ్లి ఫ్యాక్ట్ చెక్ చేసుకోవచ్చు.. మీరు ఆ గ్రామానికి వెళ్తే ప్రజలే ఏమీ జరిగిందో చెబుతారు.. ఇక, సురేష్ అనే వ్యక్తి మా పార్టీ కార్యకర్తే.. ఆయనకు భూమి లేకపోయినా గొడవ చేశాడని అంటున్నారు.. కానీ సురేష్ కు భూమి ఉంది.. భూమి లేని వాళ్లే గొడవ చేశారంటూ పోలీసులు తప్పుడు సమాచారం ఇస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
KTR: రేవంత్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండాలని నేను కోరుకుంటున్నాను.. వాళ్లు పూర్తి కాలం అధికారంలో ఉంటేనే మళ్లీ బీఆర్ఎస్ 15 ఏళ్ల పాటు అధికారంలోకి ఉంటుందన్నారు. ఎన్నికల సంస్కరణాలు చేస్తే ఒక వ్యక్తి రెండు టర్మ్ ల కన్నా ఎక్కువ సార్లు సీఎం, పీఎం ఉండవద్దని చేయాలని నేను విజ్ఞప్తి చేస్తాను అని కేటీఆర్ పేర్కొన్నారు.
Delhi Mayor Polls: ఢిల్లీ మేయర్ ఎన్నికల ముందు గందరగోళం నెలకొంది. దళితుడు అయిన కొత్త మేయర్ పూర్తి కాలం పదవీకాలంలో కొనసాగాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎన్నికలను బహిష్కరించింది. ఈ రోజు ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో గలాటా చోటు చేసుకుంది. సాధారణంగా ప్రతీ ఏప్రిల్‌లో నిర్వహించే ఎన్నికలు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), బీజేపీ మధ్య పోరుతో ఆలస్యమైంది. కొత్త మేయర్‌కి మరో 5 నెలల పదవీ కాలం మాత్రమే లభిస్తుంది.