Mallu Ravi : కాంగ్రెస్ నేత, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన, కేటీఆర్ ఢిల్లీలో డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. గిరిజనుల కోసం పదేళ్ల పాలనలో ఏమి చేశారని ప్రశ్నించారు. లగచర్లలో ప్రజలు, రైతులను రెచ్చగొట్టింది కేటీఆర్ కాదా? అని ఆరోపించారు. గొడవలకు కారణం కేటీఆర్ అని తేలడంతో, నూతన డ్రామాలకు తెరలేపారని విమర్శించారు. రైతుల ముసుగులో బీఆర్ఎస్…
Jharkhand Elections: రేపు జార్ఖండ్ చివరి దశ ఎన్నికలు జరగబోతున్నాయి. జార్ఖండ్‌లోని 38 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న ఎన్నికలు జరుగనున్నాయి అయితే, ఇప్పుడు బీహార్ పూర్నియా నుంచి పోటీ చేసి గెలుపొందిన ‘‘పప్పూ యాదవ్’’ ప్రచారం వైరల్‌గా మారింది. ఇండియా కూటమి తరుపున ఓట్లు అడుగుతున్న ఆయనకు స్థానికుల నుంచి చేదు అనుభవం ఎదురైంది.
BJP: ముంబైలోనివి ప్రాజెక్టుపై శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) అబద్ధాలను బట్టబయటు చేసిందని బీజేపీ నేత అమిత్ మాల్వియా ఈ రోజు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. పవార్ వ్యాఖ్యలు ‘‘ ముంబై, మహారాష్ట్రలను తప్పుదోవ పట్టించడానికి ఉద్ధవ్ ఠాక్రే, రాహుల్ గాంధీ అబద్ధాలు చెబుతున్నారని స్పష్టం చేస్తున్నాయి.’
ఉచిత బస్సు పథకం తెలంగాణ మహిళలకు మరింత ఉపయోగకరంగా మారిందని మంత్రి సీతక్క చెప్పారు. మంగళవారం హనుమకొండలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో ఆమె ప్రసంగిస్తూ, ఈ పథకంపై విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయనే ఆరోపణ చేశారు.
హన్మకొండ ప్రజా పాలన-ప్రజా విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇందిరమ్మ అంటే ప్రపంచ దేశాలకు ఉక్కు మహిళ అని కొనియాడారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలను కోటీశ్వరులు చేయాలని ఉక్కు సంకల్పంతో ఉన్నామని, ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే నేను సీఎం అయ్యానని ఆయన అన్నారు.
మహారాష్ట్ర, జార్ఖండ్‌లో ప్రచార హోరు ముగిసింది. గత కొద్దిరోజులుగా నాయకులు ప్రచారాన్ని హోరెత్తించారు. రాత్రి, పగలు తేడా లేకుండా అభ్యర్థులంతా ఓటర్లను దర్శనం చేసుకున్నారు.
Kishan Reddy: సీఎం కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు తెలంగాణ రాజకీయాలను భ్రష్టు పట్టించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలపై బీజేపీ వర్క్ షాప్ నిర్వహించింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఘన విజయం సాధించారు. మరోసారి అధ్యక్ష పీఠాన్ని ట్రంప్ అధిరోహించనున్నారు. నాలుగేళ్ల పాటు అగ్ర రాజ్యం రిపబ్లికన్ పార్టీ వశం కాబోతుంది. తాజా ఫలితాల్లో ట్రంప్ మ్యాజిక్ ఫిగర్ దాటుకుని భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.
Election Campaign: నేటితో మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నెల 20వ తేదీన ఒకే విడతలో మహారాష్ట్రలోని 288 స్థానాలకు.. జార్ఖండ్ లో సెకండ్ విడత పోలింగ్ జరగనుంది.
మహారాష్ట్ర సీఎం పదవి రేసులో తాను లేనని, అయితే సీఎం పదవి తనకు రావడం ఖాయమని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఓ జాతీయ మీడియా సంస్థతో ఇంటర్వ్యూలో మాట్లాడారు. తాను తప్పకుండా సీఎం అవుతానని ఆశాభావం వ్యక్తం చేశారు.