Minister Komatireddy: ఘట్కేసర్లోని గట్టు మైసమ్మ దేవాలయాన్ని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వేలాదిగా భక్తులు తరలి వచ్చి అమ్మవారి జాతర దగ్గర మెట్లు, ఇతర మౌళిక వసతులు ఏర్పాటు చేస్తాం.. పేద ప్రజలకు అండగా ఉంటున్న ప్రజా ప్రభుత్వంపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నాను అని ఆయన తెలిపారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త పథకాన్ని స్వాగతిస్తున్నాం.. ఉపాధి హామీ కూలీలను ప్రామాణికంగా తీసుకోవడం ఒకే.. కానీ, వ్యవసాయ కూలీలు అని ఎన్నికల్లో హామీ ఇచ్చారు.. ఆత్మీయ భరోసాకు ఆంక్షలు పెట్టడం ఎంత వరకు సమంజసం?.. ప్రభుత్వ ఆంక్షలతో 10 శాతం మందికి మాత్రమే భరోసా.. 90 శాతం పథకానికి దూరం అవుతారు అని పేర్కొన్నారు.
Harish Rao- Uttam: ప్రతిపక్షం నిలదీస్తే గానీ, ఈ ప్రభుత్వం నిరు పేదల గురించి ఆలోచించదా? అని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. ప్రజాపాలన దరఖాస్తులకు కూడా రేషన్ కార్డులు ఇస్తామనే ప్రభుత్వ ప్రకటన బీఆర్ఎస్ విజయం అన్నారు.
Rahul Gandhi: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆప్‌తో పొత్తుపై కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో ఆప్‌తో పొత్తు ఉండకూడదని కోరుకున్నానని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. ఢిల్లీ ఎన్నికల తర్వాత ఆప్‌కి కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా అని ప్రశ్నించినప్పుడు..
Muda Scam: కర్ణాటకలో ముడా కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముడాకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు ఇతరులకు చెందిన 300 కోట్ల రూపాయల విలువైన 140 స్థిరాస్థుల్ని అటాచ్ చేసినట్లు ఈడీ తెలిపింది.
V. Hanumantha Rao : బీజేపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు వక్రికరించే పనిలో ఉందని, మోడీ సర్కార్ రిమోట్ కంట్రోల్ మోహన్ భగవత్ దగ్గర ఉందని విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి. హనుమంత రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అయోధ్య కట్టిన రోజే స్వాతంత్య్రం వచ్చింది అని అనడం సరికాదని, భగత్ సింగ్ లాంటి వాళ్ళ త్యాగాన్ని అవమానించినట్టు అని ఆయన మండిపడ్డారు. మోడీ.. సమాధానం చెప్పాలని, అమిత్ షా…అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు…
జనవరి 26 నుండి రైతు భరోసా అమలు అవుతుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. రైతులు, రైతు కూలీలకు భరోసా ఇస్తాం అని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిందని, షెడ్యూల్ ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్ రైతు దీక్ష అంటూ డ్రామా చేస్తుందని మండిపడ్డారు. తాము దీక్ష చేస్తేనే.. ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చిందని చెప్పుకునే పనిలో బీఆర్ఎస్ ఉందని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ, రైతు భరోసా మోసాలపై ‘రైతు ధర్నా’…
నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ.. సింగపూర్ ప్రభుత్వ ఆధీనంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐటీఈ) సంస్థతో ఎంఓయు కుదుర్చుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్ల సమక్షంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సుబ్బారావు, ఐటీఈ డిప్యూటీ డైరెక్టర్ ఫాబియన్ చియాంగ్ ఈరోజు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. సింగపూర్ ఐటీఈ పదో తరగతి చదివే విద్యార్ధుల స్థాయి…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బహిరంగ లేఖ రాశారు. దేశ రాజధాని ఢిల్లీ పరిధిలోని మెట్రో రైళ్లలో ప్రయాణించే స్కూల్, కాలేజీ విద్యార్థులకు 50 శాతం టికెట్ రాయితీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ కోసం గ్రామాల్లో సర్వే జరుగుతుందని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 2 కోట్ల 81 లక్షల మందికి ఇప్పటికే తెలంగాణలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని, పాత రేషన్ కార్డులు తొలగించడం లేదని స్పష్టం చేశారు. అర్హత ఉండి కొత్త రేషన్ కార్డులు రాని వారికి జనవరి 26 నుండి కొత్త కార్డులు ప్రభుత్వం ఇస్తుందని, ప్రతిపక్షాలు…