జైన సన్యాసి గుణధర్ నంది మహారాజ్ మాట్లాడుతూ.. నాకు రెండు కలలు ఉన్నాయి.. ఒకటి జైన డెవలప్మెంట్ కార్పొరేషన్ బోర్డు ఏర్పాటు చేయడం, ఇంకోటి డీకే శివ కుమార్ ముఖ్యమంత్రి కావాలని పేర్కొన్నారు.
కమలం పార్టీ నేత రమేష్ బిదూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి కూడా ఆయన ముఖ్యమంత్రి అతిషి మార్లెనాని టార్గెట్ చేశారు. ఆమె తల్లిదండ్రులు పార్లమెంట్పై దాడి చేసిన టెర్రరిస్టు అఫ్జల్ గురుకు మద్దతు ఇచ్చారని ఆరోపణలు గుప్పించారు.
MLC Kavitha: యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలపై, ఇళ్లపై దాడి చేసే వారిని కవిత హెచ్చరించారు. ‘మా పార్టీ కార్యాలయాలపైకి, ఇళ్లపైకి వస్తామంటే భయపడే ప్రసక్తే లేదు. 60 లక్షల మంది సైనికులు ఉన్న కుటుంబం బీఆర్ఎస్ పార్టీ అని ఆమె పేర్కొన్నారు. ‘60 లక్షల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు తలుచుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు…
Addanki Dayakar: టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ వివిధ అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగ పరిరక్షణను కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక బాధ్యతగా తీసుకుంటుందని, ఈ విషయంలో రాహుల్ గాంధీకి దేశ ప్రజల మద్దతు మరింత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన బీజేపీ వైఖరిపై ఘాటు విమర్శలు చేశారు. 2029లో దేశంలో పూర్తిస్థాయి అధికారంలోకి రావడానికి బీజేపీ నార్త్, సౌత్లో రాజకీయ కుట్రలు పన్నుతోందని దయాకర్ ఆరోపించారు. జెమిలి ఎన్నికలతో ప్రయోగాలు…
Congress: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనూ రాజ్యాంగంపై దాడి ప్రధాన ప్రతిపక్షం, విపక్షాల మధ్య రాజకీయ పోరుకు దారి తీసింది. దీంతో ఈరోజు (జనవరి 21) కర్ణాటకలోని బెలగావిలో జై బాపు, జై భీమ్, జై రాజ్యాంగ ర్యాలీతో కాంగ్రెస్ ప్రారంభించనుంది.
Rahul Gandhi: సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్ దొరికింది. లోక్ సభ ఎన్నికలకు ముందు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీపై చేసిన వ్యాఖ్యలకు గాను రాహుల్ పై దాఖలైన పరువు నష్టం కేసులో ఆయనపై నమోదైన క్రిమినల్ విచారణను సుప్రీంకోర్టు నిలిపివేస్తున్నట్లు ఈరోజు (జనవరి 20) ప్రకటించింది.
హైదరాబాద్లో అఫ్జల్గంజ్ కాల్పుల దుండగులు.. అఫ్జల్గంజ్ కాల్పులు జరిపిన దుండగులు హైదరాబాద్లోనే ఉన్నారని పోలీసులు తెలిపారు. ఆ ముఠా ఇంకా రాష్ట్రం దాటలేదన్నారు. పూటకో డ్రెస్ తో హైదరాబాద్ గల్లీల్లోనే తిరుగుతున్నారని చెప్పుకొచ్చారు. ఆటోల్లో ప్రయాణిస్తూ.. పోలిసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నారు.. హైదరాబాద్ లోని ప్రతి ఏరియా తెలిసి ఉండటం వల్లే.. అంత ఈజీగా తిరుగుతున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దుండగులకు ఎవరో ఒకరు హైదరాబాద్ కి చెందిన వాళ్ళే షెల్టర్ ఇచ్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.…
మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఆహార భద్రత రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాల లక్ష్యాన్ని నీరు కార్చొద్దు అన్నారు. అర్హులకు మాత్రమే ప్రభుత్వ పథకాలు అందాలని తెలిపారు.
ప్రభుత్వం కొత్త పథకాలు ప్రారంభించినప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయని అన్నారు. ఎమ్మెల్సీ కవిత, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఇచ్చిన సూచనలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం.. గత ప్రభుత్వంలో రైతు బంధు దుర్వినియోగం అయ్యింది అని ఆయన ఆరోపించారు. మా సర్కార్ హయంలో కేవలం సాగు చేసే రైతులకు మాత్రమే మేము రైతు భరోసా ఇస్తామన్నారు.