TPCC Chief: హామీల అమలుకు కొంత ఆలస్యం కావచ్చు కానీ.. ప్రజల్ని మోసం చేయము!
- కాంగ్రెస్ ప్రభుత్వం జనాలను మోసం చెయ్యదు
- జీహెచ్ఎంసీపై ఫోకస్ చేస్తున్నాము
- ఫిబ్రవరి రెండో వారంలో రాహుల్ గాంధీ సభ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు కొంత ఆలస్యం కావచ్చు కానీ.. ప్రజల్ని మాత్రం మోసం చేయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని పథకాల అమలు ఉంటుందని స్పష్టం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉద్దేశం డబ్బులు లేవని కాదని, అధికారుల వల్ల కొంత ఆలస్యం అవుతుందన్నారు. జీహెచ్ఎంసీపై ఫోకస్ చేస్తున్నామని, మేయర్ పీఠం గెలుచుకుంటామని పీసీసీ చీఫ్ ధీమా వ్యక్తం చేశారు.
పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ… ‘జీహెచ్ఎంసీపై ఫోకస్ చేస్తున్నాం. మేయర్ పీఠం గెలుచుకోవాలని ప్లానింగ్ చేశాం. కేంద్రం నుండి రూపాయి నిధులు ఇవ్వలేని ఇద్దరు బీజేపీ కేంద్ర మంత్రులు ఉన్నారు. ఇవాళ జీహెచ్ఎంసీ సమావేశంకి బీజేపీ వాళ్లు బిక్షాటన చేస్తూ రావడం విడ్డూరంగా ఉంది. కుల సర్వే జరిగితే బీఆర్ఎస్, బీజేపీలు తమకు నష్టం జరుగుతుందని అనేక కుట్రలు చేశాయి. ఫిబ్రవరి 5న ఉప సంఘం కేబినెట్ నివేదిక ఇస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు కేబినెట్‌లో నిర్ణయిస్తారు’ అని చెప్పారు.
Also Read
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
- Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
- ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
- SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
‘స్పీకర్ ఉద్దేశం డబ్బులు లేవని కాదు. అధికారుల వల్ల కొంత ఆలస్యం అవుతుంది. హామీల అమలుకు కొంత ఆలస్యం కావచ్చు కానీ.. ప్రజల్ని మోసం చేయడం అంటూ ఉండదు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని పథకాల అమలు ఉంటుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరుపై ఇప్పటికే కసరత్తు జరిగింది. ఢిల్లీకి పేర్లు పంపించాము. ఏఐసీసీ అధికారికంగా ప్రకటిస్తుంది. సమయాన్ని బట్టి సీఎం ఇంటి దగ్గర సమీక్ష చేస్తారు, అందులో తప్పేంటి?. సచివాలయం కూల్చి మరలా కట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని బీఆర్ఎస్ సమాధానం చెప్పాలి. ఫిబ్రవరి రెండో వారంలో సూర్యాపేట జిల్లాలో రాహుల్ గాంధీ సభ ఉంటుంది. పటాన్ చెరుపై కమిటీ నివేదిక ఇంకా రాలేదు. ఎమ్మెల్యే కమిటీ ముందుకు రావాల్సి ఉంది. సమస్య సామరస్యపూర్వకంగా పరిష్కారం జరుగుతుంది’ అని పీసీసీ చీఫ్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
-
Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
-
ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!