Chandigarh: ఆప్-కాంగ్రెస్ కూటమికి బిగ్ షాక్.. చండీగఢ్ మేయర్ బీజేపీ కైవసం
- చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఆప్-కాంగ్రెస్ కూటమికి షాక్
- చండీగఢ్ మేయర్ పదవి బీజేపీ కైవసం
- షాకిచ్చిన కూటమి కౌన్సిలర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఆప్-కాంగ్రెస్ కూటమికి షాక్ తగిలింది. అనూహ్యంగా మేయర్ పదవిని బీజేపీ కైవసం చేసుకుంది. చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ కొత్త మేయర్‌గా బీజేపీకి చెందిన హర్‌ప్రీత్ కౌర్ బబ్లా గురువారం ఎన్నికయ్యారు. ఆప్‌కి చెందిన ప్రేమ్ లతపై విజయం సాధించారు. లతకు 17 ఓట్లు వస్తే.. బాబ్లాకు 19 ఓట్లు వచ్చాయి. ప్రిసైడింగ్ అధికారి రామ్‌నీక్ సింగ్ బేడీ అధికారికంగా ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Sridhar Babu: గ్రామీణ ప్రాంతాల్లో మినీ ఎంఎస్‌ఎంఈ పరిశ్రమల్ని ఏర్పాటు చేయడమే లక్ష్యం!
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని అసెంబ్లీ హాలులో ఉదయం 11:20 గంటలకు పోలింగ్ ప్రారంభమై మధ్యాహ్నం 12:19 గంటలకు ముగిసింది. మేయర్ ఎన్నిక కోసం బీజేపీ, ఆప్-కాంగ్రెస్ కూటమి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అనంతరం ఫలితాలు తర్వాత ఆప్-కాంగ్రెస్ కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓటింగ్‌కు ముందు 39 మంది సభ్యులు ఉన్న సభలో కూటమికి మొత్తం 19 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఎక్స్-అఫిషియో సభ్యుడు, ఎంపీ మనీష్ తివారి మద్దతుతో బలం 20కి చేరుకుంది. మరోవైపు బీజేపీకి కేవలం 16 మంది కౌన్సిలర్లే ఉన్నారు. మెజార్టీ సాధించాలంటే 19 మంది ఉండాలి. అయితే ఫిరాయింపు కౌన్సిలర్లతో అనూహ్యంగా మేయర్ పీఠాన్ని బీజేపీ తన్నుకుపోయింది. ప్రతిపక్ష కూటమికి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు బీజేపీకి అనుకూలంగా ఓటు వేయడంతో మేయర్ పదవిని సొంతం చేసుకుంది. పంజాబ్-హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తి(రిటైర్డ్) జై శ్రీ ఠాకూర్‌ను మేయర్ ఎన్నికకు స్వతంత్ర పరిశీలకురాలిగా సుప్రీంకోర్టు నియమించింది.
ఇది కూడా చదవండి: Forest and Revenue Officials Joint Committee: పెద్దిరెడ్డి భూ ఆక్రమణలు..! అటవీ, రెవెన్యూ శాఖల విచారణ ప్రారంభం..
హర్‌ప్రీత్ కౌర్ బబ్లా..
హర్‌ప్రీత్ కౌర్ బబ్లా(60).. మాజీ కౌన్సిలర్ దేవిందర్ సింగ్ బబ్లా భార్య. అలాగే రిటైర్డ్ ఆర్మీ కల్నల్ కుమార్తె. హర్‌ప్రీత్ డెహ్రాడూన్‌లోని జీసస్ అండ్ మేరీ కాన్వెంట్‌లో పూర్వ విద్యార్థిగా ఉన్నారు. డిగ్రీలో బీఏ, ఆంగ్లంలో పీజీ చేశారు. చండీగఢ్ అభివృద్ధికి అంకితభావంతో పని చేస్తానని ఆమె పేర్కొన్నారు.
🚨 KHELA with Kejriwal 🎯
BJP wins Chandigarh Mayor Election, defeating the AAP & Congress alliance 🔥
BJP’s Harpreet Kaur Babla win mayor election by 19-17 🤯
— Three councillors did cross-voting 👏 pic.twitter.com/k0qtTMlbRD
— Megh Updates 🚨™ (@MeghUpdates) January 30, 2025
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!