Kejriwal: బీజేపీని గెలిపించేందుకే కాంగ్రెస్ పోటీ చేస్తోంది.. కేజ్రీవాల్ ఆరోపణలు
- బీజేపీని గెలిపించేందుకే కాంగ్రెస్ పోటీ చేస్తోంది
- ఆప్ అధినేత కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియా కూటమిలో భాగమైన కాంగ్రెస్, ఆప్.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా మారి ఢీకొంటున్నాయి. ఇప్పటికే రెండు పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. తాజాగా మరోసారి మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్.. కాంగ్రెస్ టార్గెట్‌గా తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీని గెలిపించేందుకే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేస్తోందని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Live-in relation: కుళ్లిపోయిన స్థితిలో తండ్రి, కూతురు మృతదేహాలు.. “లివ్-ఇన్ పార్ట్‌నర్” అరెస్ట్..
Also Read
- Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
- Jantar Mantar: కన్నీళ్లకు సాక్షి.. విప్లవాలకు వేదిక.. జంతర్ మంతర్ కథ ముగిసినట్టేనా?
- Sergio Gor: గత వారం మోడీ-ట్రంప్ మాట్లాడుకున్నారు.. ఏం జరుగుతుందో చూద్దామన్న సెర్గియా గోర్
- Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
కాంగ్రెస్ మద్దతుదారులను ఉద్దేశించి కేజ్రీవాల్ వీడియో సందేశంలో హస్తం పార్టీపై ఆరోపణలు చేశారు. ఎన్నికల ప్రచారం ముగింపు దశకు వచ్చినా.. ఆ పార్టీ నేతలు బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని ధ్వజమెత్తారు. అంటే బీజేపీని గెలిపించేందుకే కాంగ్రెస్ నేతలు పని చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ మద్దతుదారులతో ఒకటే చెప్పానని.. ‘‘కాంగ్రెస్‌కు ఓటు వేస్తే.. బీజేపీ అధికారంలోకి వస్తుంది. అదే జరిగితే పాఠశాలలు నాశనమవుతాయి. ఉచిత కరెంట్, నీళ్లు, మొహల్లా క్లినిక్‌లు, మహిళలకు ఉచిత బస్సు ఇలా అన్నీ ఆగిపోతాయి. ఒక కుటుంబం నెలకు రూ.25 వేలు నష్టపోవాల్సి వస్తుందని చెప్పాను. వాళ్లంతా ఏకీభవించారు. చీపురు గుర్తుకే ఓటు వేస్తామని చెప్పారు’’ అని కేజ్రీవాల్ వీడియోలో వివరించారు.
ఇది కూడా చదవండి: Electric Vehicles: పెట్రోల్ – డీజిల్ కంటే ఎలక్ట్రిక్ వాహనాలతో అధిక కాలుష్యం!
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఫిబ్రవరి 5న ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొంది.
తాజావార్తలు
-
West Indies Players-ICC: వెస్టిండీస్కు భారీ షాక్.. ఇద్దరు స్టార్ బ్యాటర్లపై ఐసీసీ చర్యలు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Hyderabad: జైల్లో భర్త.. తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ భార్యను హత్య చేసి భర్త ఫ్రెండ్..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
ట్రెండింగ్
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!