Ponnam Prabhakar: బడ్జెట్‌ను అడ్డుకోవడం అంటే.. హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకున్నట్టే!
- బీఆర్ఎస్ తీరుపై మంత్రి పొన్నం అసహనం
- అభివృద్ది జరుగుతుంటే ఈర్శగా ఉందా?
- అవిశ్వాసం ఎదుర్కోవడానికి కాంగ్రెస్ సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) బడ్జెట్‌ను అడ్డుకోవడం అంటే హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకున్నట్టే అని హైదారాబాద్ ఇన్చార్జి, రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి అన్నారు. జీహెచ్ఎంసీ బడ్జెట్ సమావేశాలను అడ్డుకోవడం రాజ్యాంగాన్ని అపహస్యం చేయడమే అని పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాలు అడ్డుకోవడంపై బీఆర్ఎస్ నాయకత్వం జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరంలో గత పది ఏళ్లలో లేని అభివృద్ది ఇప్పుడు జరుగుతుంటే ఈర్శగా ఉందా? అని మంత్రి పొన్నం విమర్శించారు.
జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశంలో రసాభాస నెలకొంది. బడ్జెట్ ఆమోదం తర్వాత ప్రజా సమస్యలపై చర్చించాలని బీఆర్ఎస్ పట్టుబట్టింది. ఈక్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్లకు మధ్య వాగ్వాదం జరిగింది. నలుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లను మార్షల్స్ బయటకు తీసుకెళ్లగా.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ పోడియాన్ని చుట్టుముట్టి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అదుపులోకి తీసుకున్న కార్పొరేటర్లను తీసుకువచ్చి సభను నిర్వహించాలన్నారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ వ్యవహరించిన తీరుపై మంత్రి పొన్నం ప్రభాకర్ అసహనం వ్యక్తం చేశారు.
Also Read
- T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
- India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
‘జీహెచ్ఎంసీ బడ్జెట్ సమావేశాలను బీఆర్ఎస్ అడ్డుకోవడం రాజ్యాంగాన్ని అపహస్యం చేయడమే. జీహెచ్ఎంసీ బడ్జెట్ హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించిన అంశం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడడానికి సీఎం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజా పాలన ప్రభుత్వం శ్రద్ధతో పని చేస్తుంది. మేయర్‌పై అవిశ్వాసం పెట్టుకునే హక్కు అందరికీ ఉంది. అవిశ్వాసం ఎదుర్కోవడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. బడ్జెట్‌ను అడ్డుకోవడం అంటే హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకున్నట్టే. బడ్జెట్ సమావేశాలు అడ్డుకోవడంపై బీఆర్ఎస్ నాయకత్వం జవాబు చెప్పాలి. హైదరాబాద్ నగరంలో గత 10 ఏళ్లుగా (తెలంగాణ ఏర్పడిన తరువాత) జరగని అభివృద్ది ఇప్పుడు జరుగుతుంది కాబట్టి దానిని నిరోధించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో లేని అభివృద్ది హైదరాబాద్లో ఇప్పుడు జరుగుతుంటే ఈర్శగా ఉందా?’ అని మంత్రి పొన్నం పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!