Congress: కర్ణాటక కాంగ్రెస్ నేతల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. కేపీసీసీ అధ్యక్షు పదవీపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో మరో మంత్రి మాటల యుద్ధానికి దిగారు. నాయకులు ఇష్టానుసారం మాట్లాడరాదని ఇటీవలే హైకమాండ్ ఆదేశించినా పట్టించుకునే పరిస్థితి అక్కడ కనపడటం లేదు.
Omar Abdullah: జమ్ముకశ్మీర్‌లో అభివృద్ధి కోసమే కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలనుకుంటున్నాను అని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు. కేంద్రంతో నిర్మాణాత్మక సంబంధాలను కొనసాగించడమే తమ లక్ష్యం.. ఇలా చేయడం భారతీయ జనతా పార్టీతో కలిసినట్టు కాదు అని ఆయన క్లారిటీ ఇచ్చారు.
Delhi Election 2025: ఓటర్ల అభిప్రాయాలను ప్రభావితం చేసే ఏఐ జనరేటెడ్ కంటెంట్ వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని రాజకీయ పార్టీలకు భారత ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
Congress: ప్రార్థనా స్థలాలా చట్టం-1991ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై గత నెలలో సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించిందవి. అయితే, ప్రార్థనా స్థలాల కేసులో కాంగ్రెస్ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. గురువారం అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ఆ పార్టీ కోరింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను ప్రక్కదారి పట్టించడానికే అరెస్టులని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. గట్టిగా ఆరు గ్యారంటీలు అడిగుతే తమపై కేసులు పెడుతున్నారు.. కేటీఆర్ ఇచ్చిన పథకాలను అడిగితే తమపై కేసులు పెడుతున్నారని కౌశిక్ రెడ్డి తెలిపారు.
ప్రస్తుత రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాల్సిన వ్యక్తి జైపాల్ రెడ్డి అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. దేశ చరిత్రలో ప్రజాస్వామ్య విలువ కాపాడిన గొప్ప నాయకుడు అని, తెలంగాణ రాష్ట్ర సాకారం చేయడంలో జైపాల్ రెడ్డి పాత్రను మర్చిపోలేమన్నారు. ఇవాళ హైదరాబాద్ అంతర్జాతీయంగా గుర్తింపు రావడానికి, మెట్రో రైల్ రావడంలో జైపాల్ రెడ్డి పాత్ర కీలకం అని జీవన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ బిల్లు ఆమోదంలో జైపాల్ రెడ్డి పాత్ర కీలకమైనదని ఎమ్మెల్యే వినోద్ కుమార్…
Tamil Nadu: తమిళ కవి తిరువళ్లువర్ దినోత్సవం సందర్భంగా తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి నివాళులు అర్పించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. బుధవారం చెన్నైలోని రాజ్ భవన్ ప్రాంగణంలో తిరువళ్లువర్ చిత్రపటానికి గవర్నర్ రవి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ఇప్పటికే సమాజ్‌వాదీ పార్టీ ప్రకటించింది. తాజాగా ఇదే అంశంపై బుధవారం అఖిలేష్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఆప్‌కు మద్దతు ఇవ్వడానికి గల కారణాలు వెల్లడించారు.
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ముఖ్య నేతలంతా నామినేషన్లు దాఖలు చేశారు. సీఎం అతిషి, మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నామినేషన్లు దాఖలు చేశారు.
మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆయన బరిలో దిగారు. నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి ముందు కేజ్రీవాల్ తన భార్య సునీతతో కలిసి హనుమాన్, వాల్మీకి ఆలయాల్లో ప్రార్థనలు నిర్వహించారు.