Rakesh Rathore: అత్యాచారం కేసులో కాంగ్రెస్ ఎంపీ అరెస్ట్..
- అత్యాచారం కేసులో కాంగ్రెస్ ఎంపీ రాకేష్ రాథోడ్ అరెస్ట్..
- పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళపై నాలుగేళ్లుగా లైంగిక దోపిడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rakesh Rathore: ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన కాంగ్రెస్ ఎంపీ రాకేష్ రాథోడ్ అత్యాచార కేసులో ఈ రోజు అరెస్టయ్యారు. సీతాపూర్ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న రాకేష్ రాథోడ్ విలేకరులతో సమావేశం నిర్వహిస్తున్న సమయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. గత నాలుగు ఏళ్లుగా తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఉత్తర్ ప్రదేశ్ యూనిట్ జనరల్ సెక్రటరీగా ఉన్న రాథోడ్‌పై జనవరి 17న పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Also: Anna Hazare: ‘‘డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చాడు’’.. కేజ్రీవాల్‌పై అన్నాహజారే సంచలన వ్యాఖ్యలు..
Also Read
- UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
- Neha Bora: నాలుగోసారి కూడా.. శాంతి ఒప్పందంపై సంతకానికి నేహా బోరా నిరాకరణ
- Bangladesh: షేక్ హసీనా వీడియో వివాదం.. బంగ్లాదేశ్ మాజీ ఎయిర్‌ఫోర్స్ అధికారి మృతి..
- Naseeruddin Shah: 'నేను దిమాగీ నక్సల్‌నే'.. విద్యార్థుల పోరాటానికి మద్దతుగా నసీరుద్దీన్ షా సంచలన వ్యాఖ్యలు..
తనను వివాహం చేసుకుంటానని, రాజకీయ జీవితాన్ని ఇస్తానని హామీ ఇచ్చి తనపై అత్యాచారం చేశాడని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ అరెస్ట్ జరిగింది. ఆమె కాల్ వివరాలను, కాల్ రికార్డులను పోలీసులకు అందించింది. గత వారం, బాధిత మహిళ భర్త కూడా ఐదుగురిపై వేర్వేరుగా ఫిర్యాదు చేశాడు. రాథోడ్, అతని కుమారుడు కేసుని సెటిల్ చేసుకోవాలని తమ కుటుంబంపై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపించారు.
బుధవారం, అలహాబాద్ హైకోర్టు రాథోడ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ని తిరస్కరించింది. లొంగిపోవాలని కోరింది. హైకోర్టుకు ముందు సీతాపూర్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు జనవరి 23న అతడి ముందుస్తు బెయిల్ పిటిషన్‌ని తిరస్కరించింది. కాంగ్రెస్‌లో చేరడానికి ముందు రాథోడ్ యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన గతంలో మాయావతి బహుజన సమాజ్ పార్టీతో సంబంధాలను కలిగి ఉన్నాడు.
తాజావార్తలు
-
OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?