Mallikarjun Kharge wins the Congress presidential elections:కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో అంతా అనుకున్న ప్రకారం మల్లికార్జున ఖర్గే విజయం సాధించారు. శశిథరూర్ పై భారీ మెజారిటీతో విజయం సాధించారు. రెండు దశాబ్ధాల తరువాత తొలిసారిగా గాంధీయేతర వ్యక్తి కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టనున్నారు. ఖర్గేకు 7897 ఓట్లు రాగా.. శశి థరూర్ కు కేవలం 1072 ఓట్లు మాత్రమే వచ్చాయి. 137 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగడం…
Break for Bharat Jodo Yatra on October 17: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారు. ప్రస్తుతం కర్ణాటకలో పాదయాత్ర కొనసాగుతోంది. తరువాత ఏపీ, తెలంగాణ రాష్ట్రంలోకి భారత్ జోడో యాత్ర ప్రవేశించనుంది. ఇదిలా ఉంటే అక్టోబర్ 17న రాహుల్ పాదయాత్రకు బ్రేక్ పడనుంది. 17న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారత్…
Shashi Tharoor Comments on Mallikarjun kharge: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అనేక రాజకీయ పరిణామాాల మధ్య అధ్యక్ష బరిలో మల్లికార్జున ఖర్గేతో పాటు శశిథరూర్ ఉన్నారు. ఇదిలా ఉంటే అధ్యక్ష ఎన్నిక ఏకభిప్రాయంతో కావాలని.. ఈ విషయాన్ని శశిథరూర్ కు చెప్పానని మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. మరోవైపు శశిథరూర్ కూడా తన ప్రచారాన్ని ప్రారంభించారు. మల్లికార్జున ఖర్గే అభ్యర్థిత్వంపై శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీలో మార్పలు…
Mallikarjun Kharge Comments on congress president elections: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఏకాభిప్రాయంతో అధ్యక్షుడిని ఎన్నుకుంటే మంచిదని అన్నారు మల్లికార్జున ఖర్గే. ఇదే విషయాన్ని శశిథరూర్ కు చెప్పానని ఆయన అన్నారు. ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు ఎవరూ కూడా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకోలేదని ఖర్గే అన్నారు. కొంతమంది సీనియర్ నాయకులు నన్ను పోటీ…
Congress President Elections: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు చర్చనీయాంశంగా మారాయి. అనేక మలుపులు తిరుగుతున్న ఈ ఎన్నికలు ప్రస్తుతం ఓ కొలిక్కివచ్చాయి. కాంగ్రెస్ అధ్యక్షఎన్నికల కోసం మల్లికార్జున ఖర్గేతో పాటు శశిథరూర్, జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి కేఎన్ త్రిపాఠి నామినేషన్లు దాఖలు చేశారు. తాజాగా త్రిపాఠి నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో పోటీలో ఇద్దరే మిగిలారు. వీరిద్దరి మధ్యే పోటీ నెలకొననుంది.
Congress President Elections: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఎవరెవరు పోటీ పడుతున్నారనే దానిపై క్లారిటీ వచ్చింది. సీనియర్ నాయకులు మల్లికార్జున ఖర్గేతో పాటు శశి థరూర్ పోటీలో నిలిచారు. చివరి నిమిషంలో దిగ్విజయ్ సింగ్ తప్పుకోవడంతో తెరపైకి అనూహ్యంగా మల్లికార్జున ఖర్గే పేరు వచ్చింది. గతంలో అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపడుతారని అనుకున్నప్పటికీ.. రాజస్థాన్ రాజకీయ సంక్షోభం కారణంగా అశోక్ గెహ్లాట్ పోటీ నుంచి తప్పించుకున్నారు. ప్రస్తుతం అధ్యక్ష పోటీలో ముగ్గురు వ్యక్తులు బరిలో…
Rajasthan Political Crisis: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో చిచ్చురేపుతున్నాయి. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు పార్టీ అధ్యక్ష పదవిలో పోటీ చేస్తారని అనుకుంటున్నప్పటికీ.. ఆయన సీఎం పదవిని వదిలిపెట్టేందుకు ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. సచిన్ పైలెట్ సీఎం కావడం అశోక్ గెహ్లాట్ కు మొదటినుంచి ఇష్టం లేదు. సచిన్ పైలెట్ ను ముఖ్యమంత్రి చేయవద్దనే డిమాండ్ పై గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలు మొండిగా వ్యవహరిస్తున్నారని.. పార్టీ పరిశీలకుడు అజయ్ మాకెన్ అన్నారు.…
congress president elections: కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం జరుగుతున్న ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్లు చెప్పారు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్. గాంధీ కుటుంబం నుంచి ఎవరూ కూడా అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనడం లేదని శుక్రవారం ఆయన తెలిపారు. నేను పోటీ చేయాలనుకుంటున్నానని.. త్వరలోనే నామినేషన్ దాఖలు చేస్తానని అశోక్ గెహ్లాట్ వెల్లడించారు. దేశం ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిపక్షం బలంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
Bhart Jodo Yatra: భారత్ జోడో యాత్రకు బ్రేక్ పడింది. గత రెండు వారాలుగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారి నుంచి ప్రారంభం అయిన యాత్ర ప్రస్తుతం కేరళలో సాగుతోంది. ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ గురువారం ఢిల్లీ వెళ్లారు. దీంతో శుక్రవారం ఒక రోజు భారత్ జోడో యాత్రకు బ్రేక్ పడింది. మళ్లీ సెప్టెంబర్ 24 నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర మొదలుకానుంది. శనివారం నుంచి జరిగే…