కరోనా వ్యాక్సినేషన్లో జూన్ 21 వ తేదీనీ ఇండియా ప్రపంచ రికార్డ్‌ను సృష్టించింది. ఉచిత టీకాలను ప్రతిపాదించిన మొదటిరోజే ఇండియాలో 88 లక్షల మందికి టీకాలు వేశారు. అయితే, రెండో రోజు ఆ సంఖ్య 54 లక్షలకు పడిపోయింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పీ చిదంబరం స్పందించారు. మోడీ ఉంటే ఇలాంటి అద్భుతాలు సాధ్యమే అని, బహుశా ఈ రికార్డ్ కు నోబెల్ బహుమతి ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని అన్నారు. Read: ఆ…
విజన్ ఉన్న నేత రాహుల్ గాంధీ.. దేశం కోసం ఆయన ఏఐసీసీ పగ్గాలు చేపట్టాలని కోరారు సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క.. గాంధీభవన్‌లో జరిగిన రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని వ్యవస్థలను మోడీ సర్కార్ కూల్చి వేస్తోందని మండిపడ్డారు.. మాటలతో బతికే ప్రధాని మోడీ అని దుయ్యబట్టిన ఆయన.. యువత ఉద్యోగాలు లేక నిరాశతో ఉందన్నారు.. ఆస్తులు అన్నీ అమ్మకానికి…
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్‌గా మాణిక్యం ఠాగూర్ కొనసాగుతారా.. కొత్త వ్యక్తి వస్తారా? అయితే బాధ్యతలు చేపట్టే ఆ మూడో కృష్ణుడు ఎవరు? ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లో.. గాంధీభవన్ సర్కిళ్లలో ఇదే చర్చ జోరుగా ఉంది. ఇంతకీ ఠాగూర్ ఎందుకు వెళ్లిపోతారు? ఆయన ఫోకస్ దేనిపై ఉంది? తమిళనాడు పీసీసీ పీఠంపై ఠాగూర్ కన్ను తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియలో ఇన్నాళ్లూ బిజీగా ఉన్న కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్.. మరో పదవిపై…
పిసిసి నియామకంపై మాజీ మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. పిసిసి అనేది ఏఐసీసీ పరిధిలోని అంశమని.. నేను పిసిసి రేసులో లేనని పేర్కొన్నారు. తనకు ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు.. ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు. పిసిసి ఎవరికి ఇవ్వాలన్నది ఏఐసీసీకి తెలుసు అని తెలిపారు. అంతకు ముందు భూముల అమ్మకంపై కెసిఆర్ సర్కార్ పై శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. ప్రజల సంపదని..ప్రభుత్వం అమ్మాలని చూస్తుందని.. 30 వేల ఎకరాలను అమ్ముకోవాలని వేలం…
తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ నియామక ప్రక్రియపై మళ్లీ పంచాయతీ మొదలైంది. పదవి నాకు కావాలి.. అంటే నాకు అంటూ పోటీ పడుతున్నారు నేతలు. పదవి కోసం పోటీ పడటం సహజమే. అయితే, నాకు పదవి వచ్చినా రాకపోయినా… పక్కోడికి మాత్రం రావొద్దు అనే తరహా ఫిర్యాదులు చేసే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు. ఎవరికి వారు… తమ పంతాన్ని నెగ్గించుకునే పనిలో పడ్డారు. పార్టీ క్లిష్ట కాలంలో పదవి కోసం పోటీ చూసి సంతోష పడాలో… తన్నులాట చూసి…
వేగంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పటి వరకు కేవలం దేశంలో 4 శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్ అందించారని, ప్రతి ఒక్కరికి ఉచితంగా వ్యాక్సిన్ అందించాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మాణిక్యం ఠాగూర్ డిమాండ్ చేశారు. ఈరోజు తెలంగాణలోని జిల్లాల్లో కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని, 7 వతేదీన గాంధీభవన్ తో పాటు, జిల్లా కేంద్రాల్లో ఉదయం 9గంటల నుంచి మద్యాహ్నం ఒంటిగంత వరకు…
మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత ఈటల రాజేందర్ తర్జన భర్జన తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.. రేపు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్న ఈటల.. వచ్చేవారం బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇక, ఇదే ఊపులో మరిన్ని చేరికలు బీజేపీ తెరలేపుతోంది.. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.. ఏ పార్టీలో చేరలేదు.. ఏ పార్టీలో చేరాలన్నదానిపై కొన్ని రోజుల తర్వాత నిర్ణయం తీసుకుంటానని తన రాజీనామా సందర్భంగా వెల్లడించారు.…
ఈరోజు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం ఢిల్లీ జరిగింది. వర్చువల్ విధానం ద్వారా ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలపై సోనియా గాంధీ ఫైర్ అయ్యారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై అధినేత్రి సోనియా అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతల పనితీరుపై ఆమె మండిపడ్డారు. అదే విధంగా ఈ సమావేశంలో దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ, వ్యాక్సిన్, లాక్ డౌన్ తదితర అంశాలపై కూడా చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూశారు. ఈనెల 15 వ తేదీన సబ్బం హరి కరోనా బారిన పడ్డారు. మూడోరోజులపాటు సబ్బం హరి హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. తరువాత వైద్యుల సలహామేరకు ఆయన విశాఖ అపోలో ఆసుపత్రిలో చేరారు. కరోనాతో పాటుగా ఆయనకు పలు ఇన్ఫెక్షన్లు సోకడంతో పరిస్థితి విషమించింది. వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే మరణించినట్టు వైద్యులు పేర్కొన్నారు. జూన్ 1, 1952 లో జన్మించిన సబ్బం హరి 1995 లో విశాఖపట్నానికి మేయర్…