ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. గాంధీ భవన్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి చార్జీ తీసుకుంటారు. అయితే పీసీసీ చీఫ్ గా రేవంత్ ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. సీనియర్లను కలుపుకుపోవడం ఒక ఎత్తు అయితే.. కేడర్ లో జోష్ నింపాల్సిన బాధ్యత మీద పడింది. ఇప్పటికే జానారెడ్డి మొదలుకుని ఒక్కొక్కరు సీనియర్ నేత ఇళ్లకు వెళ్లి కలిసి, వారి ఆశీస్సులు తీసుకున్నారు. అందరినీ కలుపుకుపోతానని రేవంత్…
రేపు టీపీసీసీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి బాధత్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే… గాంధీ భవన్ లో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక రేపు పదవీ బాధత్యలు తీసుకుంటున్న నేపథ్యంలో.. ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేయనున్నారు రేవంత్ రెడ్డి. తర్వాత అక్కడ నుంచి బయలుదేరి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మీదుగా నాంపల్లి దర్గాకు చేరుకుంటారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్నారు రేవంత్. read also : తెలంగాణ ఎక్సైజ్ శాఖలో ప్రమోషన్ల…
కృష్ణా జలాల వినియోగంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా కోసం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు ఢిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేయాలని.. ఆ దీక్షకు కాంగ్రెస్ కూడా మద్దతు ఇస్తుందంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి.. తెలంగాణ కోసం ఏం చేయాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలుసన్న ఆయన.. దీక్షలు చేయాలని మాకు చెప్పడం కాదు.. ముందు కాంగ్రెస్ పార్టీ…
పీజేఆర్ కుమారుడు విష్ణు ఇంటికి ఇవాళ రేవంత్ రెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పీజేఆర్ చరిత్రను గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ అంటే పీజేఆర్.. పీజేఆర్ అంటే కాంగ్రెస్ అనిపించారని.. సీఎల్పీ నేతగా అప్పటి ప్రభుత్వాలను గడగడలాడించారని.. హైదరాబాద్ కు కృష్ణా జలాల కోసం పీజేఆర్ పోరాటం చేశారని పేర్కొన్నారు. ఈ రోజు హైదరాబాద్ లో నీటి సమస్య పరిష్కారం.. పీజేఆర్ వల్లే సాధ్యమైందన్నారు. బస్తీలలో ఇప్పటికీ పీజేఆర్ అంటే ప్రేమ ఉందని… తెలంగాణలో పీజేఆర్…
టి.పీసీసీ చీఫ్‌గా నియమితులైన రేవంత్‌రెడ్డిపై సెటైర్లు వేశారు ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్.. కరీంనగర్ జిల్లా ఇళ్లందకుంట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సోషల్ మీడియా వారియర్స్ సమ్మేళనం కార్యక్రమానికి హాజరైన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పలు అంశాలపై స్పందించారు.. కొత్త బిచ్చగాడు పొద్దు ఎరుగడు అన్నట్టు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని.. టీఆర్ఎస్ లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టండి అంటున్నాడు.. మరి.. డబ్బులు ఇస్తూ రెడ్ హ్యాండ్ గా…
పీసీసీ పదవుల పందేరంలో ఆ జిల్లా నేతలకు ఎందుకంత ప్రాధాన్యం లభించింది? గత ఎన్నికల తర్వాత సైలెంట్ అయినప్పటికీ వారికి కలిసొచ్చిన సమీకరణాలేంటి? ఇప్పటికైనా యాక్టివ్‌గా పనిచేస్తారా? పార్టీ వర్గాల్లో జరుగుతోన్న చర్చ ఏంటి? ఉమ్మడి మెదక్ జిల్లాలో నలుగురికి పీసీసీలో కీలక పదవులు ఒకప్పుడు మెదక్ జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉండేది. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఒకటి రెండుచోట్ల మినహా దాదాపు అన్ని సీట్లు తన ఖాతాలో వేసుకునేది. జిల్లా నుంచి రాష్ట్రస్థాయి నాయకుల…
కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.. ఇకపై రాజకీయపరమైన విషయాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని ప్రకటించారు.. కేవలం ప్రజా సమస్యలు తీర్చేందుకు ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటానని ప్రకటించిన ఆయన.. తనను రాజకీయాల్లోకి లాగవద్దు అని విజ్ఞప్తి చేశారు.. ఇక నుంచి భువనగిరి, నల్గొండ పార్లమెంట్ పరిధిలోని ప్రతి గ్రామంలో పర్యటించి అక్కడ తిష్ట వేసిన సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషిచేస్తానని వెల్లడించారు కోమటిరెడ్డి… గ్రామాల అభివృద్దికి…
కొత్త పీసీసీ అధ్యక్షుడి కోసం సుదీర్ఘ కసరత్తు చేసిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చివరకు రేవంత్ రెడ్డిని కొత్త చీఫ్‌గా నియమించింది… అయితే, ఆది నుంచి పీసీసీ అధ్యక్ష పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ వచ్చిన.. పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి నిరాశే ఎదురైంది. దీంతో.. పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి… పీసీసీ చీఫ్‌పై చర్చ జరిగిన ప్రతీసారి ఢిల్లీ వెళ్లి మరీ మంతనాలు జరిపిన కోమటిరెడ్డికి పదవి మాత్రం…
తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డిని అధిష్టానం ప్రకటించింది. అయితే ప్రకటన వచ్చిన కాసేపటికే మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నేత కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి పార్టీకి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏఐసీసీ సభ్యత్వానికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి శనివారం రాత్రి లేఖ పంపారు.ఇక టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్న రేవంత్ రెడ్డి.. పార్టీలో చిన్ని చిన్న విభేదాలు సహజమేనని.. అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని…