కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అలకబూనారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆయనకు ఆశ పెట్టారు. ఆ ఆశను మొగ్గలోనే తుంచేశారు. నిద్రలేపి.. సినిమా చూపించారు. వాస్తవానికి… ‘నాకు ఇది కావాలి..!’ అని ఆయన అడిగింది లేదు. ఇప్పుడు సీన్ రివర్స్ కావడంతో తీవ్ర ఆవేదనలో ఉన్నారట ఆ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. ఇంతకీ ఎవరాయన? ఏంటా ఆశ?
ఇంకా గాంధీభవన్ మెట్లెక్కని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి!
Also Read
తెలంగాణ కాంగ్రెస్ చీఫ్‌గా రేవంత్‌రెడ్డిని ప్రకటించిన వెంటనే మాజీ ఎమ్మెల్యే KLR, తర్వాత ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. కీలక పదవుల్లో ఉన్న నాయకులు మాత్రం సైలెంట్‌గా ఉన్నారు. హైకమాండ్ రాయబారంతో.. ఇప్పుడు అంతా సర్దుకున్నట్టు కనిపిస్తుంది. సీనియర్ నాయకుడు.. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాత్రం ఇంకా మౌనం వీడలేదు. ఇప్పటి వరకు గాంధీ భవన్ మెట్లెక్కలేదు. రేవంత్ ప్రమాణ స్వీకారానికి కూడా రాలేదు. రాజకీయ వివాదాలకు దూరంగా ఉండే జీవన్‌రెడ్డి ఇలా ఎందుకు మారిపోయారు? ఆయన్ని ఇబ్బంది పెట్టిన అంశం ఏంటి? రేవంత్ లేదా ఇంకెవరిపైనైనా పెద్దాయన అలిగారా? కొత్త పీసీసీ చీఫ్ ప్రమాణ స్వీకారానికి అభినందన లేఖతో సరిపెట్టిన జీవన్‌రెడ్డి మనసు నొచ్చుకుందనే ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా ఉంది.
పీసీసీ చీఫ్‌ను చేస్తానంటే వద్దన్నారట!
పార్టీ పెద్దలు ఒప్పించడంతో ఓకే చెప్పారట
మాజీ మంత్రి.. సీనియర్ నాయకుడైనా.. కాంగ్రెస్‌లో తన పనేదో చేసుకుపోతారు జీవన్‌రెడ్డి. సాగర్ ఉపఎన్నిక ముందు పీసీసీ నియామక ప్రక్రియ మొదలైనప్పుడు ఆయనే పీసీసీ చీఫ్ అని ప్రచారం జరిగింది. మేడమ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఢిల్లీ పెద్దలు కబురందించారట. ‘నాకు వద్దు బాబు’ అని జీవన్‌రెడ్డి అన్నా.. ‘మేడమ్ ఆదేశాలు పాటించండి’ అని కూడా చెప్పారట. కానీ ఇంతలో రాజకీయ చక్రం తిరగబడింది. సీనియర్ నాయకులు అప్పట్లో పీసీసీ నియామక ప్రక్రియ ఆపేయాలని చెప్పడంతో బ్రేక్ పడింది. పీసీసీ చీఫ్ అయిపోయినట్టే అని అనుకుంటే తాజా పరిణామాలతో ఆయన మనసు చివుక్కుమందట.
ఫోన్‌లోనే ఠాగూర్‌కు తలంటేశారట!
జీవన్‌రెడ్డి పేరు ఖరారవుతుందని అనుకున్న సమయంలో పీసీసీ ఎంపిక ప్రక్రియను మళ్లీ మొదలుపెట్టారు AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్. ఆ సమయంలో జీవన్‌రెడ్డికి కాల్ చేశారట ఠాగూర్. సాధారణంగా కూల్‌గా ఉండే మాజీ మంత్రి.. ఆ ఫోన్‌లో ఠాగూర్‌పై ఒంటికాలిపై లేచారట. అంతా మీ ఇష్టమేనా? అప్పట్లో నన్ను ఇబ్బంది పెట్టి మరీ ఒప్పించారు. ఎందుకు ఆ ప్రక్రియ ఆపేశారో తెలియదు. ఇప్పుడు మళ్లీ ఎందుకు మొదలు పెడుతున్నారో అర్థం కావడం లేదు. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. మళ్లీ నన్ను అడగటం ఎందుకు? అని ఓ రేంజ్‌లో ఫైర్ అయినట్టు పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఆ ప్రశ్నలకు ఠాగూర్ దగ్గర సమాధానం లేదని చెబుతున్నారు. రిప్లయ్ ఏమీ ఇవ్వకుండానే ఆయన ఫోన్ పెట్టేశారట.
జీవన్‌రెడ్డి చెప్పేదాంట్లో లాజిక్ ఉందా?
ఆ తర్వాత పార్టీ అంశాలేవైనా జీవన్‌రెడ్డికి చెప్పాలంటే ఇంఛార్జ్ కార్యదర్శి బోసురాజును రంగంలోకి దించుతున్నారట. కొత్త కమిటీపై అసంతృప్తితో ఉన్న సీనియర్లను కూల్ చేస్తున్నా.. ఈ మాజీ మంత్రి దగ్గరకు వచ్చే సరికి అవేమీ వర్కవుట్ కావడం లేదట. పైగా జీవన్‌రెడ్డి చెప్పేదాంట్లో లాజిక్ ఉందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. పీసీసీ చీఫ్ కాకపోయినా.. ఇంకేదైనా కీలక అవకాశం ఇచ్చిఉంటే ఇప్పుడీ సమస్య వచ్చేది కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి జీవన్‌రెడ్డి ఎపిసోడ్ పార్టీలో ఆసక్తిగా మారింది.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!