హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.. గతంలో ఆ నియోవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.. ఇక, పాడి కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించింది కాంగ్రెస్ పార్టీ… అధికార టీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కై.. పార్టీకి ద్రోహం చేస్తున్నాడంటూ.. కౌశిక్‌రెడ్డిపై వేటు వేసింది పీసీసీ… టీఆర్ఎస్ తో కుమ్మక్కై కౌశిక్‌రెడ్డి.. కోవర్టుగా మారి.. కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తున్నందుకు బహిష్కరణ వేటు వేసినట్టు ప్రకటించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి… కాగా, కౌశిక్.. అధికార పార్టీకి దగ్గరగా ఉంటున్నారనే ప్రచారం గత కొంతకాలంగా సాగుతుండగా.. తాజాగా లీక్‌అయిన ఆడియో టేపులు కలకలం సృష్టించాయి.. హుజురాబాద్‌లో టీఆర్ఎస్ టికెట్ తనకే వస్తుందంటూ ఆయనే స్వయంగా చెప్పడం సంచలనంగా మారింది.. యూత్‌ను కూడా సమీకరించండి.. డబ్బులు ఇద్దాం.. మీకు నేను అండగా ఉంటా.. అంటూ ఆయన మాట్లాడినట్టు ఉన్న టేపులు వైరల్‌గా మారాయి.. ఈ నేపథ్యంలో టీపీసీసీ క్రమశిక్షణా సంఘం.. కౌశిక్‌కు షోకాజ్ నోటీసులు కూడా జీరా చేసిన సంగతి తెలిసిందే.