ఉమ్మడి ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ మళ్లీ సొంతగూటికి చేరనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు ఢిల్లీ నుంచి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు పిలుపు అందింది. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశాలతోనే డీఎస్ మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. గురువారం సాయంత్రం సోనియాతో డీఎస్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ తర్వాతే డీఎస్ చేరికపై…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన స్వరం మార్చారు. ఇటీవల రాహుల్ ప్రధాని కాలేరని వ్యాఖ్యానించిన ప్రశాంత్ కిషోర్… తాజాగా తన మాట మార్చుకుని రాహుల్ ప్రధాని అయ్యే అవకాశాలున్నాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ లేకుండా ప్రతిపక్ష పార్టీలు కేంద్రంలో అధికారం చేపట్టడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. గాంధీ పరివారం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ మనుగడ సాధించగలదని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్ చేసిన తాజా వ్యాఖ్యలు…
తెలంగాణ కాంగ్రెస్‌లో ఆయన ఎక్స్ట్రా ప్లేయరేనా? పదవి ఇవ్వాలి కాబట్టి.. ఇచ్చారా..? దీనివల్ల పార్టీకి కలిగే ప్రయోజనాలేంటి? కేడర్‌లో జరుగుతున్న చర్చ ఏంటి? యూపీ కోటాలో.. ప్రియాంకా సిఫారసుతో తెలంగాణలో పదవి? తెలంగాణ కాంగ్రెస్‌లో ఎవరికీ పదవి గ్యారెంటీ లేకున్నా.. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్‌కు పక్కా. సొంత రాష్ట్రంలో పరిస్థితి ఏంటో తెలియదు కానీ.. మరో రాష్ట్రంలో కోటాలో ఆయనకు ఇక్కడ పదవి ఖాయం. ఇదేంటి అని ఎవరైనా ప్రశ్నిస్తే.. ఉత్తరప్రదేశ్ కోటా.. ప్రియాంకా గాంధీ…
తెలంగాణలో ఇవాళ వెలువడిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ క్లీన్‌స్వీప్ చేసింది.. స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరు స్థానాలకు గాను.. ఆరింటిని తన ఖాతాలోనే వేసుకుంది గులాబీ పార్టీ.. అయితే, కొన్ని చోట్ల క్రాస్ ఓటింగ్ అధికార పార్టీ నేతలను కలవరానికి గురిచేస్తోంది… ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీకి పడాల్సిన ఓట్లు.. ప్రతిపక్ష కాంగ్రెస్ అభ్యర్థికి క్రాస్ అయ్యాయి… ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి 116 ఓట్లు…
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం రోశయ్య మృతి పట్ల ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోశయ్య కుమారుడు శివకు ఫోన్ చేసి రాహుల్ గాంధీ తన ప్రగాఢ సంతాపం తెలిపారు. రోశయ్య ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబీకులు ధైర్యంగా ఉండాలని రాహుల్ గాంధీ ఆకాంక్షించారు. అనంతరం కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావుకు కూడా రాహుల్ గాంధీ ఫోన్ చేసి రోశయ్య మరణంపై వివరాలను తెలుసుకున్నారు. Read Also:…
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం మమతా బెనర్జీ అంచనాలను పెంచింది. ఆ గెలుపు ఆమెను ప్రధాని పీఠంపై కన్నేసేలా చేసింది. వచ్చే ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీకి అసలు సిసలు ప్రత్యర్థి తానే అని భావిస్తున్నారామె. ఆ భావనను ప్రజలలో స్థిరపరచేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకు, మొదట కాంగ్రెస్ పై పైచేయి సాధించాలని చూస్తున్నారు. అందుకే హస్తం పార్టీ అసంతృప్త నేతలకు గాలం వేస్తున్నారు. పొరుగున ఉన్న ఈశాన్య భారతం టార్గెట్‌గా కాంగ్రెస్‌ని ఖాళీ చేయిస్తున్నారు. అదే…
కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన వరిదీక్షకు దిగింది. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి ఇందిరాపార్క్ దీక్షలో సెంట్రాఫ్ అట్రాక్షన్ అయ్యారు. సీఎం కేసీఆర్‌ని అడ్డుకోవాలన్నారు. టీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. పదవుల గురించి తాను పనిచేయడం లేదన్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేసీఆర్ సర్కార్ తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ, రేపు ధర్నాచౌక్‌లో ‘వరి దీక్ష’ చేపట్టింది. ఈ దీక్షకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా దాదాపు కలిసి వచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. ఎంపీ…
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈనెల 29 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఢీల్లీల్లో సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు భేటీ అయ్యారు. ఈ మేరకు ద్రవ్యోల్బణం, చమురు ధరల పెంపు, చైనా వివాదం, కాశ్మీర్ అంశంపై పార్లమెంట్లో కేంద్రాన్నిప్రశ్నించనున్నట్టు తెలిపారు. కాగా కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను కేబినెట్ నుంచి తొలగించాలని పట్టు పట్టనుంది. కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాలని డిమాండ్ చేయనున్నట్టు కాంగ్రెస్ నేత మల్లిఖార్జన ఖర్గే…
కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బుధవారం నాడు హైదరాబాద్ నగరానికి రానున్నారు. తన కుమారుడు రైహాన్‌కు కంటి గాయం కావడంతో హైదరాబాద్‌లోని ఎల్వీప్రసాద్ కంటి ఆస్పత్రిలో ప్రియాంక గాంధీ చికిత్స చేయించనున్నారు. నాలుగేళ్ల కిందట రైహాన్ క్రికెట్ ఆడుతున్న సమయంలో కంటికి గాయమైంది. అప్పట్లో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో రైహాన్‌కు చికిత్స నిర్వహించారు. కానీ ఫలితం లేకపోవడంతో ఎయిమ్స్ వైద్యులు రైహాన్‌ను హైదరాబాద్ తీసుకువెళ్లాలని సూచించారు. ఇప్పటికే ఓసారి హైదరాబాద్‌లో చికిత్స పొందిన…
తెలంగాలోని రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మోదీ, కేసీఆర్ ఒక్కటేనని.. ఇద్దరూ కలిసి రైతులను నట్టేట ముంచడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు అసెంబ్లీ రౌడీ సినిమాలోని ఓ సీన్ గురించి రేవంత్ వివరించారు. ఆ సినిమాలో విలన్ మనుషులు రోడ్డు మీదకు వచ్చి తమలో తామే కొట్టుకుంటారని… తమకు టార్గెట్‌గా ఉన్నవారిని చంపేందుకు వాళ్లు అలా చేస్తారని రేవంత్ గుర్తుచేశారు. ఇప్పుడు తెలంగాణలో కూడా టీఆర్ఎస్, బీజేపీ…