తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేద్దామా? వద్దా..? అనే విషయంపై కాంగ్రెస్ పార్టీ తర్జన భర్జన పడుతోంది… లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ విషయంపై ఇవాళ పీఏసీ సమావేశమై చర్చింది.. అయితే, పోటీపై ఎలాంటి నిర్ణయానికి రానట్టుగా తెలుస్తోంది.. ఇక, నల్గొండలో పోటీ చేయాలా..? వద్దా..? అనేది జిల్లా నాయకులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం అని ఈ సమావేశంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి తెలిపినట్టుగా సమాచారం.. మరోవైపు..…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఓ వైపు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంపై పార్టీ అధిష్టానం పోస్టుమార్టం చేస్తున్న సమయంలో.. ఆయన చేసిన కామెంట్లు పార్టీలో కలకలం రేపుతున్నాయి.. సమన్వయ లోపమే హుజురాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమికి కారణంగా తేల్చిన ఆయన.. గతంలో పీసీపీ అధ్యక్షులుగా ఉన్న కె. కేశవరావు (కేకే), డి. శ్రీనివాస్ (డీఎస్) కాంగ్రెస్‌ను మోసం చేశారని మండిపడ్డారు.. మరోవైపు…
హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితంపై తెలంగాణ ప్రజలు మొత్తం ఉత్కంఠగా ఎదురుచూశారు.. ఈ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే, పార్టీ మారిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అయితే, అధికార టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ మధ్య హోరా హోరా జరిగినా.. ఈటలకు భారీ మెజార్టీయే దక్కింది.. అయితే, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే టార్గెట్‌గా చెబుతున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ బై పోల్‌లో చతికిలపడిపోయింది.. అయితే, గత ఎన్నికల్లో 60…
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు అంతా జట్టు కట్టారా? రేవంత్ మీద నుంచి టార్గెట్ మళ్లించారా.. లేక వ్యూహాత్మక ఎత్తుగడ ఎంచుకున్నారా? వరస భేటీల వెనక వ్యూహం ఏంటి? వారి తాజా లక్ష్యం ఎవరు? ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్‌పై సీనియర్ల గురి..! ఒకరికొకరు చెక్ పెట్టుకోవడంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎవరికి వారే దిట్ట. ఏదైనా తమ దారిలోకి రావాలని అనుకుంటారు తప్పితే.. అంతా ఒకేదారిలో నడిచే ప్రసక్తే లేదన్నట్టుగా ఉంటుంది నేతల వ్యవహార శైలి. ఒకరు యస్…
హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘోర వైఫల్యంపై హైకమాండ్ సీరియస్‌గా ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. ఈనెల 13న ఢిల్లీ రావాలని పీసీసీ అధ్యక్షుడు సహా సుమారు 13 మంది నేతలను హైకమాండ్ ఆదేశించింది. హుజూరాబాద్ ఓటమిపై ఏఐసీసీ స్థాయిలో సమీక్షించనున్నట్లు సమాచారం. ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్‌కు కేవలం మూడు వేల ఓట్లే రావడంపై హైకమాండ్ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ ఓట్ల శాతం…
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలకు కీలక ఆదేశాలు ఇచ్చారు టి. కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మానిక్కం ఠాగూర్.. తెలంగాణలో 30 లక్షల పార్టీ సభ్యత్వాలు చేయించాలని సూచించిన ఆయన.. ఇక, వచ్చే ఎన్నికల్లో 80 లక్షల ఓట్లు టార్గెట్ గా పెట్టుకుని పనిచేయాలని ఆదేశించారు.. రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 78 స్థానాలను గెలవడమే టార్గెట్‌గా పెట్టుకోవాలని.. అందరూ అది దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలని సూచించారు.. ప్రతీ బూత్ కు ఒక లీడర్‌ను తయారు…
ప్రాంతీయ పార్టీల ఏకైక సిద్ధాంతం అవకాశవాదం మాత్రమే అన్నారు మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. 2023 లో తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. టీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతం దాచుకోవడం.. దోచుకోవడం. మహాత్మా గాంధీని చంపింది బీజేపీ, ఆర్ఎస్ఎస్ లే. నెహ్రూను తక్కువచేసి చూపించేందుకు బీజేపీ సావర్కర్ ను తెరపైకి తీసుకు వస్తుందన్నారు ఉత్తమ్. ఒక్క సంతకంతో దేశం మొత్తం రైతు రుణమాఫీ చేసిన చరిత్ర…
హైదరాబాద్‌లోని కొంపల్లిలో కాంగ్రెస్ నేతల శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. అయితే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో ఆయన ముందే రెండు వర్గాలు కొట్లాటకు దిగాయి. తమకు శిక్షణ తరగతుల పాసులు ఇవ్వలేదని ఆందోళన చేశాయి. జనగామ నియోజకవర్గ పరిధిలో మొదటి నుంచి పని చేస్తున్న వారికి పాసులు ఇవ్వలేదని ఆరోపించాయి. బ్లాక్ కాంగ్రెస్, మండల కాంగ్రెస్ అధ్యక్షులను కాదని కొత్త వారికి ఇచ్చారని మండిపడ్డాయి. పొన్నాల లక్ష్మయ్య మనుషులకు మాత్రమే ఇచ్చి తమను దూరం…
తెలంగాణ సీఎం కేసీఆర్.. ఫోకస్ మొత్తం ఇప్పుడు భారతీయ జనతా పార్టీపై పెట్టినట్టుగా కనిపిస్తోంది.. హుజురాబాద్ ఉప ఎన్నికల తర్వాత ఆదివారం నిర్వహించిన ప్రెస్మీట్లో రాష్ట్ర నేతలను టార్గెట్ చేస్తూనే.. కేంద్రం విధానాలను తప్పుబట్టిన కేసీఆర్.. ఇవాళ రెండో రోజు కూడా.. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం వైఖరిపై, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.. అయితే, ఇదే సమయంలో తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని కాస్త లైట్‌గా తీసుకుంటున్నారు…