తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలకు కీలక ఆదేశాలు ఇచ్చారు టి. కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మానిక్కం ఠాగూర్.. తెలంగాణలో 30 లక్షల పార్టీ సభ్యత్వాలు చేయించాలని సూచించిన ఆయన.. ఇక, వచ్చే ఎన్నికల్లో 80 లక్షల ఓట్లు టార్గెట్ గా పెట్టుకుని పనిచేయాలని ఆదేశించారు.. రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 78 స్థానాలను గెలవడమే టార్గెట్‌గా పెట్టుకోవాలని.. అందరూ అది దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలని సూచించారు.. ప్రతీ బూత్ కు ఒక లీడర్‌ను తయారు చేయాలని సూచించిన మాణిక్కం ఠాగూర్… గ్రూపు తగాదాలు లేకుండా కలసికట్టుగా పనిచేయాలని స్పష్టం చేశారు. కాగా, తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీలో కొత్త జోష్ వచ్చిందని పార్టీ నేతలు చెబుతున్నారు.. కానీ, పార్టీలోని సీనియర్ నేతలు ఇప్పటికీ రేవంత్‌రెడ్డితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా లేరని.. కొన్ని సందర్‌భాల్లో వారి వ్యాఖ్యలతో స్పష్టం అవుతూనే ఉంది. ఇక, ఈ వ్యవహారాన్ని అధిష్టానం సీరియస్‌గా తీసుకుని ఎప్పటికప్పుడు చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.