కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బుధవారం నాడు హైదరాబాద్ నగరానికి రానున్నారు. తన కుమారుడు రైహాన్‌కు కంటి గాయం కావడంతో హైదరాబాద్‌లోని ఎల్వీప్రసాద్ కంటి ఆస్పత్రిలో ప్రియాంక గాంధీ చికిత్స చేయించనున్నారు. నాలుగేళ్ల కిందట రైహాన్ క్రికెట్ ఆడుతున్న సమయంలో కంటికి గాయమైంది. అప్పట్లో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో రైహాన్‌కు చికిత్స నిర్వహించారు. కానీ ఫలితం లేకపోవడంతో ఎయిమ్స్ వైద్యులు రైహాన్‌ను హైదరాబాద్ తీసుకువెళ్లాలని సూచించారు. ఇప్పటికే ఓసారి హైదరాబాద్‌లో చికిత్స పొందిన రైహాన్ మరోసారి నగరానికి వస్తున్నాడు.
Read Also: బస్సు ప్రమాదంలో 45 మంది సజీవదహనం
ఈమేరకు ప్రియాంక గాంధీ తన కుమారుడితో కలిసి రేపు హైదరాబాద్ వస్తున్నారు. ఎల్వీప్రసాద్ ఆస్పత్రిలో చికిత్స అనంతరం వారు బుధవారం సాయంత్రం ఢిల్లీకి తిరుగుప్రయాణం కానున్నారు. కాగా రాబర్ట్ వాద్రా-ప్రియాంక గాంధీ దంపతులకు కుమారుడు రైహాన్, కుమార్తె మిరాయా ఉన్నారు. రైహాన్ పూర్తి పేరు రైహాన్ రాజీవ్ వాద్రా. అతడు వైల్డ్ ఫోటోగ్రాఫర్‌గా చిన్నతనంలోనే గుర్తింపు తెచ్చుకున్నాడు.