కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఓ వైపు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంపై పార్టీ అధిష్టానం పోస్టుమార్టం చేస్తున్న సమయంలో.. ఆయన చేసిన కామెంట్లు పార్టీలో కలకలం రేపుతున్నాయి.. సమన్వయ లోపమే హుజురాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమికి కారణంగా తేల్చిన ఆయన.. గతంలో పీసీపీ అధ్యక్షులుగా ఉన్న కె. కేశవరావు (కేకే), డి. శ్రీనివాస్ (డీఎస్) కాంగ్రెస్‌ను మోసం చేశారని మండిపడ్డారు.. మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి సోదరుడు కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీ ఇప్పించుకుంటున్నారని మండిపడ్డారు.. ఇలాగే కొనసాగితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం అంటూ హాట్ కామెంట్లు చేశారు.
Read More: పీఆర్సీపై సర్కార్‌కు డెడ్‌లైన్..!
ఇక, హుజురాబాద్‌లో ఓటమికి మీదంటే, మీదే బాధ్యత అని పరస్పరం ఆరోపణలు చేసుకుంఉటన్నారు టి.పీసీసీ నేతలు.. హుజురాబాద్ మీదే కాకుండా నాగార్జునసాగర్, హుజూర్ నగర్, దుబ్బాక ఓటమి పై కూడా సమీక్షలు నిర్వ హించాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.. కాంగ్రెస్ పార్టీలో ఉండి కొందరు టీఆర్ఎస్ పార్టీకి సహకరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమిపై అధిష్టానం రివ్యూ నిర్వహిస్తున్న సమయంలో పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకే దారితీస్తున్నాయి. బై పోల్‌లో ఓటమి తర్వాత పార్టీని, పార్టీ రాష్ట్ర చీఫ్‌ను కొందరు సీనియర్లు టార్గెట్ చేసిన సంగతి కూడా విదితమే.