కాంగ్రెస్ పార్టీలో ఎవరి ఎజెండా వారిది కాదన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ప్రజల అజెండానే మా ఎజెండా. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వున్నప్పుడు వరి ధాన్యం సమస్య రాలేదు. ఎంతో కష్టపడి తెగుళ్ళతో పోరాడి పంట పండిస్తే వరి ధాన్యం కొనుగోలు చేయమంటే రైతులు ఏం చేయాలి. తెలంగాణ రాష్ట్ర సమితి ఆడుతున్న నాటకంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైతుల కోసమే మేం ప్రయత్నిస్తున్నాం. నేతలు ఎక్కడికక్కడ రైతులకు భరోసా ఇస్తున్నాం. చేసే…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గపోరు నడుస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంపై ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో వర్గాలు లేవని ఆయన స్పష్టం చేశారు. పార్టీలో రాహుల్ వర్గం, సోనియా వర్గంగా నేతలు ఉంటారు తప్ప స్థానిక నేతలకు వర్గాలు ఉండవన్నారు. పార్టీలో వర్గాలు ఉన్నాయని ఎవరైనా అలా ఊహించుకుంటే వాళ్ల పొరపాటేనన్నారు. అయితే వ్యక్తులకు భిన్నాభిప్రాయాలు ఉంటాయని…. భావ వ్యక్తీకరణ అనేది మన…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. తాను టీఆర్ఎస్ ఏజెంట్‌గా పనిచేస్తున్నారని ఇటీవల కొన్ని సోషల్ మీడియా ఛానళ్లు ప్రచారం చేస్తుండటంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. సదరు ఛానళ్లు రేవంత్‌రెడ్డికి అభిమానులుగా పనిచేస్తున్నాయని… రేవంత్‌కు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వకముందు మూడేళ్ల కిందటి నుంచే రాజు వస్తున్నాడంటూ తెగ హడావిడి చేసినట్లు గుర్తుచేశారు. ఇటీవల సంగారెడ్డి నియోజకవర్గంలో జరిగిన అధికారిక కార్యక్రమంలో తాను ఎమ్మెల్యే హోదాలో పాల్గొన్నానని… కేటీఆర్ ఎదురుపడితే పలకరించానని జగ్గారెడ్డి తెలిపారు.…
చీప్ లిక్కర్‌పై తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారిపోయాయి.. ఏపీలో తాము అధికారంలోకి వస్తే రూ.70 కే చీప్ లిక్కర్ అందిస్తాం.. ఆర్థిక పరిస్థితి మెరుగైదే రూ.50కే చీప్ లిక్కర్ అందిస్తామని ఆయన చేసిన వ్యాఖ్యలను అంతా ట్రోల్ చేస్తున్నారు.. అయితే.. సోము వీర్రాజు వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు శైలజానాథ్.. చీప్ లిక్కర్‌ను రూ.50కి సరఫరా చేయాలనేదే బీజేపీ జాతీయ విధానమా? అని ప్రశ్నించిన ఆయన..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ విభేదాలు చోటుచేసుకున్నాయి. పీసీసీ చీఫ్ పదవి నుంచి రేవంత్‌రెడ్డిని తప్పించాలని కోరుతూ కాంగ్రెస్ అధిష్టానానికి సీనియర్ నేత జగ్గారెడ్డి లేఖ రాశారు. అందరినీ కలుపుకుని పనిచేసేవారిని పీసీసీ చీఫ్ పదవికి నియమించాలని లేఖలో కోరారు. రేవంత్ వ్యవహారశైలితో కాంగ్రెస్ నేతలు ఇబ్బందులు పడుతున్నారని.. నేతలతో చర్చించకుండానే ఆయన పార్టీ కార్యక్రమాలను చేపడుతున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. ఓ సీనియర్ నాయకుడిగా తాను కూడా అవమానాలు ఎదుర్కొంటున్నట్లు వివరించారు. Read Also: రైతులకు గుడ్…
కేంద్ర మరో కీలక నిర్ణయానికి శ్రీకారం చుట్టనుంది. శీతాకాల సమావేశాలు గత నెలలో ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో గత సంవత్సరం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ పార్లమెంట్లో ఆమోదించారు. తాజాగా ఓటరు జాబితాలో డూప్లికేషన్‌ను నివారించేం దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో నేడు లోక్ సభ ముందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నికల చట్టాల బిల్లు 2021 ప్రవేశపెట్టనుంది. అయితే కొత్త ఓటర్ల గుర్తింపు ధృవీకరణకు ఆధార్‌ను వినియోగించటం, ఆధార్ నెంబర్ ఇవ్వకపోయినా ఓటు…
ఈనెల 28 వ తేదీన ముంబైలో కాంగ్రెస్ పార్టీ భారీ సభను ఏర్పాటు చేయాల్సి ఉన్నది. పార్టీ 137 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పెద్ద ఎత్తున ముంబైలో నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. దీనికోసం శివాజీ పార్క్‌లో బుక్ చేసుకోవాలని అనుకున్నారు. ఏర్పాట్ల కోసం డిసెంబర్ 22 నుంచి 28 వరకు శివాజీ పార్క్‌ను అద్దెకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ముంబై మున్సిపల్ కార్పోరేషన్‌ను కోరింది. అయితే, శివాజీ పార్క్ సైలెన్స్ జోన్లో ఉందని, అక్కడ…
నిత్యావసర వస్తువుల ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర చేయాలని సంకల్పించిన సంగతి తెలిసిందే. రంగారెడ్డి జిల్లా ముడిమ్యాల నుంచి చేవెళ్లలోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు 10 కిలోమీటర్లమేర పాదయాత్ర జరుగుతుంది. ఈ పాదయాత్రలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, ఇతర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ పాదయాత్ర అనంతరం భహిరంగ సభలో రేవంత్ రెడ్డి, దిగ్విజయ్ సింగ్ తదితరులు ప్రసంగిస్తారు. Read: ప్రపంచాన్ని చుట్టేస్తున్న…
★ నేడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళనలు… నిత్యావసర ధరల పెంపు నిరసిస్తూ కాంగ్రెస్ నేతల పాదయాత్రలు.. యూపీలో పాదయాత్ర ప్రారంభించనున్న రాహుల్ గాంధీ, ప్రియాంక★ నేటి నుంచి పాపికొండల విహారయాత్ర పున:ప్రారంభం.. తూ.గో. జిల్లా పోచవరం నుంచి ప్రారంభం కానున్న పాపికొండల విహారయాత్ర★ విజయవాడ: నేడు కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవం… ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఇస్రో ఛైర్మన్ డా.శివన్, గౌరవ అతిథిగా హాజరుకానున్న ఓల్వో కంపెనీ ఎండీ కమల్ బాలి, చాగంటి కోటేశ్వరరావు, సినీ…
సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క హస్తిన పర్యటన వాయిదా పడింది.. ఇవాళ ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలతో జరగాల్సిన తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క భేటీ రద్దు అయ్యింది. మరోవైపు రేపు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు రానున్నారు సీనియర్ పొలిటిషన్, రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్.. ఇక్కడికి వచ్చిన తర్వాత అనుచరులతో సమావేశమై చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణపై ఓ నిర్ణయానికి రానున్నారు. మొత్తంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాల తర్వాత తిరిగి కాంగ్రెస్…