మోడీ తెలంగాణ ను అవమానించేలా మాట్లాడలేదని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు అన్నారు. కాంగ్రెస్ వైఫల్యాల పై మోడీ రాజ్య సభలో మాట్లాడారని, టీఆర్ఎస్ గోబెల్స్ ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. సెంటిమెంటును రెచ్చగొట్టి ప్రజల దృష్టిని మరల్చాలని చూస్తుందని, అది జరగదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీకి అధికార ప్రతినిధిగా మారిందని, కేసీఆర్ సర్కారు ప్రజా వ్యతిరేకత నుండి తప్పించుకునేందుకు అబద్దాలు ప్రచారం చేస్తోందని ఆయన అన్నారు. బీజేపీ కార్యకర్తలపై భౌతిక…
తెలంగాణపై మోడీ మాటలు మంటలు రాజేస్తున్నాయి. తెలంగాణకు తల్లి లాగా..సోనియా గాంధీ రాష్ట్రం ఇచ్చిందని, మోడీ..కాంగ్రెస్ పార్టీని దోషిగా చూపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. సీమాంధ్రకు కూడా ఆర్దికంగా ఆదుకోవడం కోసం పోలవరం..స్పెషల్ స్టేటస్ ఇచ్చింది కాంగ్రెస్. ఎనిమిదేళ్ళలో విభజన హామీలు అమలు చేయకుండా మోడీ ఇప్పుడు అబద్ధాలు చెప్తున్నారన్నారు. తెలంగాణ అప్పుల ఊబిలోకి పోవడానికి మోడీ..కేసీఆర్ కారణం అన్నారు. తెలంగాణలో ఆశించిన ఉద్యోగాల కల్పన లో కేసీఆర్ వైఫల్యం చెందారన్నారు. ఐటీఐఆర్…
కర్ణాటకలో హిజాబ్ అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పలు ప్రాంతాల్లో ముస్లిం విద్యార్థినులు తల, మెడను కప్పి వుంచే స్కార్ఫ్ ధరించి క్లాసులకు హాజరవుతున్నారు. దీనినే హిజాబ్ అంటారు. అయితే హిజాబ్ ధరించి వచ్చిన విద్యార్థులను కాలేజీల్లోకి అనుమతించడం లేదు. దీనిని విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. కాలేజీలో చేరినప్పుడే తమకు ఈ విషయాలు చెప్పి ఉండాల్సిందని.. కానీ చెప్పకుండా ఇప్పుడు అనుమతించకపోవడం సరికాదని విద్యార్థులు మండిపడుతున్నారు. నిరసనలు వ్యక్తం చేసినా ప్రయోజనం లేకపోవడంతో క్లాసులకు హాజరుకాకుండా నిరాశగా వెనుతిరుగుతున్నారు.…
పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి విషయంలో ఉత్కంఠకు తెరపడింది. పంజాబ్ సీఎం అభ్యర్థిని లుథియానా వేదికగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రకటించారు. ప్రస్తుత సీఎం చరణ్‌జిత్ సింగ్ చెన్నీయే పంజాబ్ సీఎం అభ్యర్థి అని స్పష్టం చేశారు. అయితే సీఎం అభ్యర్థి అవ్వాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న నవజ్యోత్ సిద్దూకు కాంగ్రెస్ అధిష్టానం మొండిచేయి చూపించింది. అధిష్టానం ఎప్పుడూ కూడా బలహీన సీఎంలనే కోరుకుంటుందని ఇటీవల సిద్దూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపాయి.…
యూపీ అసెంబ్లీ ఎన్నికలు వేడిని రాజేస్తున్నాయి. విజయం కోసం పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ పోటీపై విషయంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. అఖిలేష్ పోటీ చేస్తున్న కర్హాల్ నియోజకవర్గంలో తమ అభ్యర్థిని బరిలో దింపరాదని కాంగ్రెస్ నిర్ణయించింది. దీనిపై బీజేపీ మండిపడుతోంది. ఉత్తరప్రదేశ్ లోని మెయిన్ పురి జిల్లా కర్హాల్ నియోజకవర్గం హాట్ టాపిక్ అవుతోంది. అధికార బీజేపీకి గట్టి సవాల్…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అధికార పక్షంతో పోరాడటం పక్కన ఉంచితే స్వపక్షంలో విపక్షాలు తయారవుతున్నాయి. తాజాగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి. హన్మంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపే కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపిస్తున్నారు. ఇటీవల తనకు అవమానం జరిగిందని.. తనను అవమానపరిచిన మంచిర్యాల సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ప్రేమ్ సాగర్ రావుకు షోకాజ్ నోటీస్ ఇవ్వాలని పట్టుబట్టాడు. ప్రస్తుతం ఈ షోకాజ్ నోటిసే కాంగ్రెస్…
ఎన్నికల సమయంలో రాజకీయ వలసలు సర్వ సాధారణం.. ఇప్పుడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగుతోన్న సమయంలో.. యూపీలో కాంగ్రెస్ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.. తాజాగా కేంద్ర మాజీ మంత్రి, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఆర్పీఎన్ సింగ్.. కాంగ్రెస్ పా్టీకి గుడ్‌బై చెప్పి.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.. ఇక, ఈ పరిణామాలపై రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్‌కు ఓ ప్రశ్న ఎదురైంది.. ? పెద్ద స్థాయి…
కాంగ్రెస్ నాయకుల కృషితోనే సభ్యత్వాలను పూర్తి చేశామని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ అన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు 20 లక్షలు పూర్తి అయిన సందర్భంగా ఆయన మాట్లాడారు. సభ్యత్వ నమోదును మరో నాలుగు రోజులు పొగిస్తున్నట్టు తెలిపారు. జనవరి 30 నాటికి 30 లక్షల సభ్యత్వం పూర్తి చేస్తామని మహేష్ గౌడ్ వెల్లడించారు. పార్టీ సభ్యత్వాల్లో టార్గెట్ పూర్తి చేయని వారిపై పార్టీ కఠినంగా వ్యవహరిస్తుందన్నారు.సభ్యత్వ నమోదును లైట్‌గా తీసుకున్న నాయకులపై పార్టీ చర్యలు…
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతోంది. మొదటి దశ పోలింగ్‌కు మరో పక్షం రోజులే ఉన్నాయి. దాంతో పార్టీలు ప్రచార వేగం పెంచాయి. ప్రస్తుత పబ్లిక్ మూడ్ ను బట్టి ఈ ఎన్నికలు బీజేపీ వర్సెస్ ఎస్పీగా కనిపిస్తున్నాయి. బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలను ఓటర్లు పెద్దగా పట్టించుకునే అవకాశం లేదనే అనిపిస్తోంది. ఈ రెండు పార్టీలు తమ బేస్ ఓటు దక్కించుకుంటే అదే పదివేలు. 2017 ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీకి 22.23…