తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో హీట్ పుట్టించిన జగ్గారెడ్డి ఇష్యూ చల్లబడినట్టే అనిపించింది.. అయితే, జగ్గారెడ్డి పదవులకు కోత విధిస్తూ తెలంగాణ పీసీసీ తీసుకున్న నిర్ణయంతో.. మరోసారి పార్టీలో కాక రాజేసినట్టు అయ్యింది.. ఇక, ఈ వ్యవహారంపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లారు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి.. మరోవైపు పీసీసీ చర్యపై మీడియాతో మాట్లాడేందుకు సిద్ధం అవుతున్నారు జగ్గారెడ్డి.. ఇలాంటి పరిస్థితుల్లో మీడియా ప్రతినిధులు ఓసారి జగ్గారెడ్డిని ప్రశ్నించారు.. ప్రస్తుతం నాతో భట్టి, ఉత్తమ్ సహా ఎవరూ మాట్లాడట్లేదన్న ఆయన..…
దేశంలో అత్యంత వృద్ధ పార్టీలో సంస్థాగత మార్పులకు సోనియాగాంధీ ప్రయత్నిస్తున్నారా? అందుకు ముహూర్తం కూడా ఖరారైందా? అంటే 10 జన్ పథ్ నుంచి అవుననే సంకేతాలు వస్తున్నాయి. ఏఐసీసీ ప్రక్షాళనకు వేళయిందంటున్నారు. త్వరలో కాంగ్రెస్ పార్టీకి కొత్తరూపు ఇవ్వనున్నారు సోనియా గాంధీ. ఏఐసీసీ, పీసీసీ పదవులపై సోనియా గాంధీ సమీక్ష నిర్వహించారు. పలు అంశాల పై పరస్పర అంగీకారం, అవగాహనకు వచ్చారు సోనియా గాంధీ, గులామ్ నబీ ఆజాద్. “అసంతృప్తి నేతల”కు నాయకత్వం వహించిన గులామ్ నబీ…
కాంగ్రెస్ పార్టీలో ఐదు రాష్ట్రాల ఓటమి తాలూకు ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఆ ఐదు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షుల రాజీనామాకు అధిష్టానం ఆదేశించిన సంగతి తెలిసిందే. మరోవైపు, జీ-23 రెబల్స్ అధిష్టానంపై గుగ్లీలు విసురుతూనే ఉన్నారు. ఇది ఇలావుంటే, రెబల్ నేతగా ముద్రపడిన సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ అతి త్వరలో సోనియా గాంధీని కలవనున్నారు. ఈ భేటీలో రాహుల్, ప్రియాంక కూడా పాల్గొంటారని సమాచారం. జీ-23 సభ్యుల ఆఖరి ప్రతిపాదనలను ఈ సందర్భంగా సోనియాకు అందచేస్తారని తెలుస్తోంది.…
కొల్లాపూర్లో జరిగిన కాంగ్రెస్ మన ఊరు- మన పోరు కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్పై విమర్శలు చేశారు. కేసీఆర్ సీఎం అయ్యి 8 ఏళ్లకు పైగా అవుతుందని.. అప్పటికీ, ఇప్పటికీ పాలమూరు మారిందా అని ప్రశ్నించారు. కొల్లాపూర్ ఎమ్మెల్యే పార్టీ మారి ఏం సాధించారని రేవంత్రెడ్డి నిలదీశారు. వాల్మీకి బోయలను ఎస్టీల్లో చేర్చుతానని కేసీఆర్ చెప్పారని.. ఆ విషయం ఏమైందని ప్రశ్నల వర్షం కురిపించారు.కేసీఆర్కు మాదిగల వర్గీకరణ…
ఈసారి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సోనూసూద్ సోదరి మాళవిక సూద్ కాంగ్రెస్ పార్టీ తరఫున మోగా నియోజకవర్గం నుండి పోటీ చేసింది. నటుడిగా చక్కని గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలకూ తన జీవితాన్ని అంకితం చేసిన సోనూసూద్ ను దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సోనూ సూద్ రాజకీయ అరంగేట్రమ్ చేస్తాడనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టలేదు కానీ తన సోదరిని రంగంలోకి దించారు.…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనపరుస్తోంది. అయితే పంజాబ్లో ఆప్ ప్రభుత్వం రావడం ఖరారు కాగా గోవాలో హంగ్ ఏర్పడుతుందని ప్రస్తుత ఫలితాల సరళి చాటి చెప్తోంది. 40 అసెంబ్లీ స్థానాలున్న గోవాలో బీజేపీ 19 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 21 మంది ఎమ్మెల్యేల అవసరం ఉంటుంది. బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో గోవా ప్రభుత్వ ఏర్పాటులో టీఎంసీ, ఇండిపెండెంట్లు కీలకం కానున్నారు.…
యూపీలో కాంగ్రెస్ ఘోరంగా పతనమైందని తాజా ఫలితాలు నిరూపిస్తున్నాయి. 403 స్థానాలకు పోలింగ్ జరగగా 400 చోట్ల హస్తం తరఫున అభ్యర్థులు పోటీ చేశారు. అయితే కేవలం ఒక్క చోట మాత్రమే ఆధిక్యత కనబరుస్తున్నారు. నానమ్మ ఇందిరా గాంధీ పోలికలు ఉన్న ప్రియాంకా గాంధీ యూపీపై ప్రత్యేక దృష్టి పెట్టి తీవ్రంగా శ్రమించినా ఓటర్లు మాత్రం కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యారు. కాంగ్రెస్ పార్టీ కంచుకోటలుగా ఉన్న అమేథీ, రాయ్బరేలీలోనూ హస్తం నేతలకు ఓటమి తప్పలేదు. కాగా…
తెలంగాణలో కొత్తగా 80వేల ఉద్యోగాల భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఈ అంశంపై స్పందించారు. నిరుద్యోగుల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కారణంగానే సీఎం కేసీఆర్ ఈరోజు ఈ ఉద్యోగ ప్రకటన చేశారని వీహెచ్ వ్యాఖ్యానించారు. ఉద్యోగాల ప్రకటనను తాము స్వాగతిస్తున్నామని.. కానీ గతంలో హామీ ఇచ్చిన విధంగా నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఒక్క కేసీఆర్ వల్లే రాలేదని.. అందరి త్యాగాల…
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ఆయన జోస్యం చెప్పారు. ప్రధాని మోదీని కథ తేలుస్తా.. గద్దె దించేవరకు నిద్రపోనని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు మాట మార్చారని రేవంత్ ఆరోపించారు. జార్ఖండ్లో సీఎం హేమంత్ సోరేన్ను కలిసిన తర్వాత బీజేపీకి వ్యతిరేకంగా ఎలాంటి ఫ్రంట్ పెట్టడంలేదని కేసీఆర్ చెప్పారని విమర్శించారు. కేసీఆర్కు రోజులు దగ్గర పడ్డాయని.. రాష్ట్రంలో పేదల కష్టాలు తీర్చాల్సిన ఆయన దేశం అంతటా…