టి.పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆరోపణలు గుప్పించిన కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావుకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి.. రేవంత్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మల్లు రవి.. వీహెచ్ నాకు అన్న లాంటివారు.. కానీ, ఆయన వ్యాఖ్యలు ఖండిస్తున్నానని పేర్కొన్నారు.. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కంటే ముందు వర్కింగ్ ప్రెసిడెంట్ అని గుర్తుచేసిన ఆయన.. బీహార్ ఐఏఎస్, ఐపీఎస్‌లకు పోస్టులు ఇవ్వొద్దు అని రేవంత్ ఎక్కడా…
భారత రాజకీయాల్లో ఒక మాట చాలా ప్రసిద్ధి. అదేంటంటే ఢిల్లీ రహదారి లక్నో నుంచే వెళుతుంది అని. దాని ప్రకారం ప్రస్తుత ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తాయని. ఇంకో మాటలో చెప్పాలంటే యూపీని గెలవకుండా ఢిల్లీని గెలవలేరని అర్థం. ప్రజాభిప్రాయం ప్రకారం.. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ, ఎస్పీ మధ్యనే ప్రధాన పోటీ. బీజేపీ జాతీయ ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌కు పెద్ద పాత్ర ఉండకపోవచ్చు. ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని…
సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలతో జగ్గారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజీనామా, కొత్త పార్టీ అనే చర్చ ఈ రోజు లేదని… మీ అందరి ఆలోచన ఏంటో తనకు తెలుసు అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. తనకు టీఆర్ఎస్లోకి వెళ్లే ఉద్దేశం లేదని.. బీజేపీలోకి వెళ్లే మాటే లేదని స్పష్టం చేశారు. ఇండిపెండెంట్‌గా ఉండాలని భావిస్తున్నట్లు పార్టీ కార్యకర్తలతో ఆయన అన్నారు. ఒకవేళ కొత్త పార్టీ పెడితే తనతో ఎంతమంది వస్తారని ఆయన అడిగారు.…
కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య. మల్లన్న సాగర్ ను సీఎం కేసీఆర్ ప్రజలకు కాకుండా కల్వకుంట్ల కుటుంబానికి అంకితం చేశారన్నారు. మసిపూసి మారెడు కాయ చందంగా కేసీఆర్ వ్యవహరించారు. కాళేశ్వరం నుంచి వర్షాకాలంలో మల్లన్న సాగర్ కు చుక్క రాదు. కాళేశ్వరం నుంచి మల్లన్న సాగర్ కు నీళ్లు రావడానికి ఎన్ని రోజులు పడతాయి. ఒక టూరిజం స్పాట్ కోసం లక్ష కోట్ల రూపాయల ఖర్చు చేశారు.…
ప్రచారం జరుగుతున్నట్టుగానే టి.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి లేఖ రాసిన ఆయన.. ఇక, ఈ లేఖ రాసిన క్షణం నుంచి తాను కాంగ్రెస్ గుంపులో లేను అని పేర్కొన్నారు.. సడెన్‌గా వచ్చి లాబీయింగ్ చేస్తే ఎవరైనా పీసీసీ కావొచ్చని పేర్కొన్న ఆయన.. తనపై కోవర్ట్ అనే నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ కాంగ్రెస్‌లో వర్గ పోరు వుండేదని పేర్కొన్న జగ్గారెడ్డి… త్వరలోనే…
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. పార్టీని వీడుతున్నారా? అనే ప్రచారం జోరుగా సాగుతోంది… ఆయన రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.. ఇప్పటికే పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్‌పై ప్రసంశలు కురిపించిన ఆయన.. ప్రభుత్వ పథకాలను ప్రశంసించారు.. ఇదే సమయంలో.. మంత్రి హరీష్‌రావును టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ ఉంటారు.. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులపై కూడా బహిరంగంగా ఆయన వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఎన్నో.. Read Also: Dharmana: కేసీఆర్ వ్యాఖ్యలతో…
మానకొండూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ పెట్టిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గాడిద పార్టీగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఏం మాట్లాడతారో, ఏం చేస్తున్నారో వాళ్లకే తెలియాలని రసమయి అన్నారు. జాతీయ పార్టీ నేతలు ఇక్కడికి వచ్చి ఏదో మాట్లాడతారని.. అది ఇక్కడున్న వాళ్లకు అర్థం కాదని ఎద్దేవా చేశారు. ఒకప్పుడు తెలంగాణలో సిరిసిల్ల ప్రాంతానికి వచ్చి వెళ్తామో లేదో తెలియని ప్రాంతంగా ఉండేదని.. ఎన్నో ఏళ్లు…
తెలంగాణ విషయంలో మోడీ వ్యాఖ్యలు రాజకీయాలను వేడెక్కించాయనే చెప్పాలి. తెలంగాణ విషయంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటలయుద్ధం కొనసాగుతూనే వుంది. తాజాగా కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జి, మానిక్కం ఠాకూర్ వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కౌంటర్ ఇచ్చారు. నాటిఉద్యమ నాయకులు , సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజా పోరాటం ద్వారా తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల కాదు. అహింసా మార్గంలో కేసీఆర్ చేపట్టిన పోరాటంలో ప్రజలంతా ఆయనతో కలిసి రావడం, ఆనాడు ప్రభుత్వంలో…
టీపీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం మూడున్నర గంటల పాటు జరిగింది. మూడున్నర గంటల పాటు శాంతియుతంగా సమావేశం నిర్వహించినట్టు నేతలు తెలిపారు. నాయకులు వ్యక్తిగత సమస్యలు ఉంటే…మానిక్కం ఠాగూర్ తో ప్రత్యేకంగా సమావేశం అవ్వాలని సూచించారు కన్వీనర్ షబ్బీర్ అలీ. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలను సమాన శత్రువులుగా అభివర్ణించింది పీఏసీ. కేసీఆర్ రాహుల్ గాంధీ కి మద్దతు ఇచ్చి…ఏడేళ్లుగా పార్టీని తిట్టిన తీరు మర్చిపోలేం అన్నారు. పోలీస్ స్టేషన్ లలో అస్సాం సీఎం పై ఫిర్యాదులపై…
హైదరాబాద్ శంషాబాద్ శివారులో సమతా విగ్రహాన్ని ఇటీవల ప్రధాని మోదీ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే సమతా విగ్రహం తయారీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. బీజేపీ ఆత్మనిర్భర్ భారత్ అంటూ ప్రచారం చేసుకుంటోందని… సమతా విగ్రహాన్ని చైనాలో తయారుచేశారని.. ఆత్మనిర్భర్ భారత్ అంటే చైనాపై ఆధారపడటమా అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్లో ఆయన పోస్ట్ చేశారు. రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. ఈ వ్యాఖ్యలతో…