లక్ష్మా పూర్ గ్రామంలో రచ్చబండ ప్రారంభం అయింది.రైతు రచ్చబండలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. ఈ ఊరు నుండే ధరణి పోర్టల్ ప్రారంభించారు..కానీ ఈ ఊర్లోనే భూముల రికార్డ్ సక్కగా లేదు. ఈ గ్రామంలో రైతు బందు..రైతు బీమా అందటం లేదు. పిల్లల పెళ్లి లకు అమ్ముకుందాం అంటే అమ్ముకునే పరిస్థితి లేదు. మంత్రి మల్లారెడ్డి అచ్చోసిన ఆంబోతు లెక్క తయారయ్యాడు. మైసమ్మ కు వదిలేసిన దున్నపోతు లెక్క తయార్ అయ్యాడు. ధరణిని అడ్డం పెట్టుకొని వందల ఎకరాలు తక్కువ ధరలకు కొంటున్నాడు. పాసు పుస్తకం లేదని అగ్గువ సగ్గువకు కొన్నాడు అంటా అంటూ నిప్పులు చెరిగారు రేవంత్.