తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరే వారి గురించి ముందే తెలుస్తుండడంతో టీఆర్ఎస్ వారిపై కేసులు పెట్టిన వేధిస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీ అంతర్గత విషయాలపై కేసీ వేణుగోపాల్ తో చర్చించామని తెలిపారు. అయితే..రానున్న కాలంలో పార్టీలో పెద్దఎత్తున చేరికలుంటాయని, ఆ జిల్లాల్లో ఉన్న పరిస్థితులను బట్టి నేతలను పార్టీలో చేర్చుకుంటున్నట్లు చెప్పారు. అయితే.. విష్ణువర్ధన్ రెడ్డి తనను కూడా లంచ్ కు ఆహ్వానించారని, మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. కాగా..…
బీజేపీ అనుకూల ప్రకటనలు… కాంగ్రెస్ నేతలతో సన్నిహిత సంబంధాలు ఆయన స్టైల్. రేవంత్ అంటే వ్యతిరేకత లేదంటారు. కానీ హస్తం పార్టీలో మాత్రం చేరలేదు. చివరికి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీని ఊరించి, ఊరించి కమలం జెండా వైపు మొగ్గిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇప్పుడు ఏకంగా బీజేపీనే టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం అంటున్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి..కొండా విశ్వేశ్వర్ రెడ్డి మధ్య ఉన్న బంధం ఏమిటనేది తెలియదు కానీ, పిసిసి…
అప్పట్లో ఆ నియోజకవర్గం హస్తానికి కంచుకోట.ఇందులో సందేహం లేదు. కానీ ఇప్పుడు మాత్రం అక్కడ చెప్పుకోదగ్గ నేత ఒక్కరూ కనిపించటం లేదట. ఒక్కరైనా దొరకరా అని అధిష్టానం ఎంత వెతికినా ప్రయోజనం లేదట. మెదక్ జిల్లా నర్సాపూర్ లో కాంగ్రెస్ అభ్యర్థిని ఎంపిక చేయటం ఆ పార్టీ పెద్ద టాస్క్‌లా మారిందట.. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గతంలో బలంగా ఉండేది. కాంగ్రెస్ తరపున సునీతా లక్ష్మారెడ్డి గతంలో మూడు సార్లు వరుసగా గెలుపొందారు.…
కాంగ్రెస్‌కు తాము దూరంగా ఉన్నామని చెప్పడానికి TRS నానా తంటాలు పడుతోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల కూటమి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకి మద్దతు ఇచ్చిన TRS… అదే కూటమిలో ఉన్న కాంగ్రెస్‌కి తాను దూరమని ఒకటికి పదిసార్లు చెబుతోంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ దగ్గరనే భావన రాబోయే ఎన్నికల్లో చేటు చేస్తుందని గులాబీ నేతల అంచనా. లోలోపల ఎలాంటి సంబంధాలున్నా.. పైకి మాత్రం బీజేపీ, కాంగ్రెస్ రెండూ తమకు ఒకటే అనే వాదన వినిపిస్తోంది టీఆర్ఎస్. అసెంబ్లీ ఎన్నికల…
సోనియా గాంధీ పర్సనల్ సెక్రెటరీపై రేప్ కేసు నమోదు చేశారు పోలీసులు.. ఉద్యోగం ఇప్పిస్తానని ప్రలోభాలకు గురుచేసి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ బాధితురాలి ఫిర్యాదు మేరకు 71 ఏళ్ల పీపీ మాధవన్‌పై అత్యాచారం అభియోగాలు మోపారు పోలీసులు