Congress Party: రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డీలా పడిపోయింది. గత 9 ఏళ్లుగా ఆ పార్టీ తరఫున అసెంబ్లీలో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. దాదాపుగా సీనియర్ నేతలందరూ ఇతర పార్టీలకు వలస వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఏపీసీసీకి కొత్త చీఫ్‌ను అధిష్టానం నియమించింది. తాజాగా ఏపీసీసీ నూతన అధ్యక్షుడిగా శైలజానాథ్ నుంచి గిడుగు రుద్రరాజు శుక్రవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రుద్రరాజును కలిసి అమరావతి రైతులు అభినందనలు తెలిపారు.…
BJP MP Ravi Kishan: యూపీలోని గోరఖ్‌పూర్ బీజేపీ ఎంపీ రవికిషన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనకు నలుగురు పిల్లలు ఉండటం తన తప్పు కాదని.. జనాభా నియంత్రణ బిల్లు తీసుకురాని కాంగ్రెస్ పార్టీదే ఆ తప్పు అని రవికిషన్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ జనాభా నియంత్రణ బిల్లు తెచ్చి ఉంటే తనకు నలుగురు కంటే తక్కువ పిల్లలు ఉండేవారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జనాభా నియంత్రణ బిల్లుపై కసరత్తు చేస్తోందని…
తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి క్యూ కట్టారు. ఎక్కే ఫ్లైట్.. దిగే ఫ్లైట్ అన్నట్టు ఉంది కాంగ్రెస్ నేతల పరిస్థితి. ఏఐసీసీకి కొత్త అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వచ్చాక.. తెలంగాణ పంచాయతీ ఆయనకు పెద్ద తలనొప్పిగా మారిందట. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లడం.. ఖర్గేతో మర్యాదపూర్వకంగా కలవడం జరుగుతోంది. కానీ, తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం.. తమ పాత పద్ధతిని వదులుకోవడం లేదట. మల్లికార్జున ఖర్గే దగ్గర తెలంగాణ కాంగ్రెస్ పంచాయతీని మొదలుపెట్టారట. నాలుగైదు రోజులు…
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కాంగ్రెస్ పార్టీలో వర్గవిభేదాల గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచింది. ఇక్కడ మాజీ ఎంపీ సురేష్ షెట్కార్, పీసీసీ నేత సంజీవ్‌రెడ్డి మధ్య ఒక్క క్షణం పడటం లేదు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నారాయణఖేడ్‌లో కాంగ్రెస్ టికెట్ కోసం ఇద్దరూ తీవ్రంగా పోటీ పడుతున్నారు. తండ్రుల వారసత్వంతో రాజకీయం చేస్తూ.. దానిని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. 2016లో అప్పటి ఎమ్మెల్యే కిష్టారెడ్డి చనిపోవడంతో.. ఇక్కడ కాంగ్రెస్‌లో మొదలైన జగడం…
Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో కొనసాగుతోంది. ఈ సందర్భంగా పలువురు సెలబ్రెటీలు ఆయనకు మద్దతుగా ఈ యాత్రలో పాల్గొంటున్నారు. తాజాగా ప్రముఖ ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొని ఆయనతో పాటు కలిసి నడిచాడు. ఈ సందర్భంగా మీసం తిప్పాలని విజేందర్ సింగ్ కోరాడు. దీంతో అతడి వినతి మేరకు విజేందర్‌తో కలిసి రాహుల్ గాంధీ మీసం మెలేశారు. ఈ…
తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకుల మధ్య అంతర్గత పోరు తారాస్థాయికి చేరింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ లక్ష్యంగా ఏఐసీసీకి ఫిర్యాదులు వెళ్లాయి.. ఇంకా వెళ్తూనే ఉన్నాయి. కాంగ్రెస్‌లో ఇది సహజమైన చర్యే. దీనికితోడు వరుసగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో అధిష్ఠానం కూడా దిద్దుబాటు చర్యలకు దిగాలనే ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అందుకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా ఆయన ఎన్నికైన…
దేశానికి, రాష్ట్రానికి ఏకైక ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయే అన్నారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షులు గిడుగు రుద్రరాజు.. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పదవి కన్నా పీసీసీని బాధ్యతగా స్వీకరిస్తాను అన్నారు.. టీమ్ వర్క్ తో ముందుకు వెళ్తాను.. ఈ దేశానికి, రాష్ట్రానికి ఏకైక ప్రత్యామ్నాయం తామేనని స్పష్టం చేశారు.. త్వరలోనే బాధ్యతలు స్వీకరించి రాష్ట్ర పర్యటన చేస్తామని ప్రకటించారు. ఇక, అగ్ర వర్ణాలవారికే పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారంటూ హర్షకుమార్ అసంతృప్తి…
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో కీలకమార్పులు చేసింది అధిష్టానం.. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్‌గా గిడుగు రుద్రరాజుని నియమించింది అధిష్టానం.. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మస్తాన్ వలి, జంగా గౌతమ్, సుంకర పద్మశ్రీ, పి. రాకేశ్ రెడ్డిని.. ఏఐసీసీ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్‌గా ఎంఎం పళ్లంరాజును.. క్యాంపెయిన్ కమిటీ చైర్మన్‌గా జీవీ హర్షకుమార్‌ను నియమించారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. అయితే, ఏఐసీసీ ఇచ్చిన పదవిని తిరస్కరించారు మాజీ ఎంపీ హర్షకుమార్.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి…