Congress Party: ఏపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన గిడుగు రుద్రరాజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress Party: రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డీలా పడిపోయింది. గత 9 ఏళ్లుగా ఆ పార్టీ తరఫున అసెంబ్లీలో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. దాదాపుగా సీనియర్ నేతలందరూ ఇతర పార్టీలకు వలస వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఏపీసీసీకి కొత్త చీఫ్‌ను అధిష్టానం నియమించింది. తాజాగా ఏపీసీసీ నూతన అధ్యక్షుడిగా శైలజానాథ్ నుంచి గిడుగు రుద్రరాజు శుక్రవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రుద్రరాజును కలిసి అమరావతి రైతులు అభినందనలు తెలిపారు. అనంతరం ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ.. తనకు కీలక బాధ్యతలు అప్పగించిన వారికీ ధన్యవాదాలు తెలియజేశారు. రెండు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని.. అన్ని అనుబంధ శాఖలను కలుపుకుని ముందుకు సాగుతానని స్పష్టం చేశారు.

Also Read
- AP Cabinet Key Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. నాలుగు కొత్త కమిషనరేట్లకు గ్రీన్‌సిగ్నల్.. వాటికి ఆమోదం..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై ఫోకస్.. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులకు సీఎం దిశానిర్దేశం
- Saikrishna Lockup Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సుప్రీంకోర్టులో కీలక పరిణామం..
- MP Mithun Reddy: తమను ఇబ్బంది పెట్టినా భరిస్తాం.. కానీ, కేడర్ జోలికి వస్తే ఊరుకోం.. మిథున్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమే తన లక్ష్యమని గిడుగు రుద్రరాజు అన్నారు. ఓటు బ్యాంకు పెంచుకునేలా అందరం కలిసి అడుగులు వేస్తామన్నారు. ఎవరి నియోజకవర్గంలో వారే నాయకుడు అని.. లోకల్ క్యాడర్‌ను కలుపుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. నీ కులం ఏదని అడిగితే.. తనకు కులం లేదని చెప్తానన్నారు. కులం, మతం కాదు.. మానవత్వంతో ముందుకు సాగుదామని గిడుగు రుద్రరాజు పిలుపునిచ్చారు. జగన్, చంద్రబాబుల స్వార్ధ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు. కేసులకు భయపడి మోదీ ముందు మోకరిల్లే పరిస్థితికి వచ్చారని ఎద్దేవా చేశారు. త్వరలోనే ఉత్తరాంధ్ర పర్యటన చేస్తానని తెలిపారు. నియోజకవర్గాల వారీగా అందరితో సమావేశాలు నిర్వహిస్తానని.. నాయకులందరికీ అందుబాటులో ఉంటానని చెప్పారు. ఎవరైనా వచ్చి తనను కలిసి అభిప్రాయాలు చెప్పొచ్చన్నారు.
Read Also: Selfie Tragedy: రేపే పెళ్లి.. సెల్ఫీ కోసం వెళ్లి లోయలో పడ్డారు
మన కులం, మతం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని గిడుగు రుద్రరాజు వ్యాఖ్యానించారు. బీజేపీని ఓడించి మోదీ నియంతృత్వ విధానాలకు చరమ గీతం పాడాలన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన నుంచి వైసీపీని తరిమికొట్టాలని అభిప్రాయపడ్డారు. అంబేద్కర్ పెట్టిన రిజర్వేషన్‌లను తొలగించాలని మోదీ చూస్తున్నారని.. ఏపీ పునర్విభజన చట్టం బిల్లు అమలుకు పోరాటం చేయాలని తెలిపారు. అంబానీ, అదానీలకు బ్రోకర్‌గా మోదీ పాలన చేస్తున్నారని విమర్శలు చేశారు. కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ సిద్ధం చేస్తామన్నారు.
మల్లిఖార్జున ఖర్గే ఆధ్వర్యంలో ఏపీలో కాంగ్రెస్ బలోపేతం కోసం అందరూ కలిసి పని చేయాలని మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఏపీ వ్యవహారాల్లో రుద్రరాజు బాగా పని చేస్తారని భావిస్తున్నానని.. ఏపీలో కాంగ్రెస్ పార్టీకు పూర్వ వైభవం తెచ్చేలా సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. తాను, శైలజానాథ్, రుద్రరాజు కలిసి పని చేశామని.. వైఎస్ఆర్, కేవీపీ తమను అనేక సందర్భాల్లో మార్గదర్శకం చేశారని తెలిపారు. తాము ఆశించకపోయినా తమను వాళ్లు ప్రోత్సహించి కాంగ్రెస్ పార్టీలో పలు పదవులు అప్పగించారన్నారు. రాహుల్ గాంధీ జోడో యాత్ర స్ఫూర్తితో నాయకులు ప్రజల్లోకి వెళ్లాలన్నారు. బీజేపీ నాయకులు అదానీ, అంబానీ వంటి వారికి దోచి పెడుతున్నారని విమర్శించారు. పేదలు మరింత దిగజారే విధంగా బీజేపీ పాలన సాగుతోందన్నారు. పెద్దల సూచనలను పరిగణలోకి తీసుకుని రుద్రరాజు ముందుకు సాగాలని ఆకాంక్షించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం కోసం తాము పనిచేస్తామన్నారు.

తాజావార్తలు
-
Baahubali : ఫౌజీ మరో బాహుబలి?
-
Mamata Banerjee: బెంగాల్లో మళ్లీ ఎన్నికలు, జ్ఞానేశ్ కుమార్ అరెస్టు.. మమత సంచలన డిమాండ్..
-
Gautam Adani: అంబానీని దాటేసిన అదానీ.. మళ్లీ దేశంలోనే నంబర్ 1 ధనవంతుడిగా రికార్డ్!
-
Best Places to Visit in India in October: అక్టోబర్‌లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 10 ప్రదేశాలు అస్సలు మిస్ కావొద్దు..
-
Meloni: యూఎన్‌కు మెలోనీ దూరం.. ట్రంప్‌ను కలవడం ఇష్టం లేకనేనా?
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!