Congress Party Demanding India China Border Issue Discussion In Parliament: అరుణాచల్ ప్రదేశ్‌లోని ‘వాస్తవాధీన రేఖ’ వద్ద భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణపై పార్లమెంట్ సమావేశాల్లో దుమారం రేగే అవకాశం ఉంది. ఈ విషయంపై లోక్‌సభలో చర్చ జరగాల్సిందేనని కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాల సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. తొలుత ఈ ఘర్షణపై చర్చను కోరుతూ.. త్రిణమూల్ కాంగ్రెస్ నోటీసు జారీ చేసింది. ఆ తర్వాత ప్రతిపక్షాలూ చర్చకు పట్టుబడుతున్నాయి. పార్లమెంట్‌లో చర్చ జరిపి.. దేశ ప్రజలను విశ్వాసంలోకి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై విరుచుకుపడింది. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ చర్చ జరగాల్సిందేనని కాంగ్రెస్ సభ్యులు మనీష్ తివారి, సయ్యద్ నాసిర్ హుస్సేన్‌లతో పాటు ఆప్ ఎంపీ రాఘవ చద్దా, ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా కోరుతున్నారు.
AHA: ఓటీటీలో ‘వాళ్ళిద్దరి మధ్య’! వీఎన్ ఆదిత్య సంచలన వ్యాఖ్యలు!!
ఇదే సమయంలో ప్రభుత్వంపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. దేశ భద్రత విషయంలో రాజీ పడేదే లేదని, అందరిదీ ఒకటే మాట అని, దీన్ని రాజకీయ చేయదలచుకోలేదని పేర్కొంది. 2020 నుంచి భారత్-చైనా మధ్య జరుగుతున్న దాడులు, సరిహద్దుల వద్ద అక్కడక్కడ జరిగిన నిర్మాణాల విషయంలో మోడీ ప్రభుత్వం నిజాయితీగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖార్గే అన్నారు. అటు.. జైరామ్ రమేశ్ కూడా చైనా చర్యలపై నిద్రబోతున్న ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసేందుకు తాము ప్రయత్నిస్తూనే ఉన్నామని, కానీ మోడీ ప్రభుత్వం మాత్రం తన రాజకీయ ప్రతిష్టను కాపాడుకోవడం కోసం దేశాన్నే ప్రమాదంలో పడేసిందని ఆరోపించారు. సరిహద్దు సమస్యను తొక్కిపెట్టాలన్న మోడీ ప్రభుత్వ ధోరణితోనే చైనా మొండివైఖరి మరింతగా పెరిగిపోతోందని విమర్శించారు.
Auto Driver Case Mystery: వీడిన ఆటో డ్రైవర్ మృతి కేసు మిస్టరీ.. భార్యతో అలా ఉన్నాడని..
ఈ నేపథ్యంలోనే గల్వాన్ ఘర్షణపై మోడీ చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. దేశంలోకి ఎవరూ రాలేదు, ఎవరూ భారత్ భూభాగాన్ని ఆక్రమించలేదు, భారత్ సైనిక స్థావరాలేవీ ఎవరి అధీనంలో లేవు అంటూ మోడీ వ్యాఖ్యానించినవీడియోను ట్వీట్ చేస్తూ.. అందులో చైనా పేరుని ప్రస్తావించి ఉంటే, ఇప్పుడా దేశం భారత్ వైపు చూసే సాహసం చేసి ఉండేది కాదని కాంగ్రెస్ చురకలంటించింది. మరోవైపు.. లోకసభ లో వాయుదా తీర్మానం కోరుతూ ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సైతం నోటీస్ ఇచ్చారు. ఘర్షణ గురించి పార్లమెంట్‌కు మోడీ ప్రభుత్వం తెలియజేయలేదని, ఆవిషయాన్ని దాచి ఉంచిందంటూ ధ్వజమెత్తారు.