Revanth Reddy: పోలీసుల ముసుగులో రౌడీలతో దాడులు చేశారని, పోన్ లు చేస్తే కనీసం లిప్ట్ చేయరని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలకు చట్టాల పట్ల ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల మీద దాడి ద్వారా తమ అధికారాన్ని పదిలం చేసుకోవడానికి రాజకీయ దాడి చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం వందలాదిమంది పోలీసుల తో కాంగ్రెస్ వార్ రూమ్ పై దాడి చేశారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో వార్ రూంలో ఫర్నిచర్ ధ్వంసం చేసి, సిబ్బందిపై దాడి చేశారని నిప్పులు చెరిగారు. షబ్బీర్ అలీ, మల్లు రవి, అనిల్ కుమార్ యాదవ్ చాలామంది నాయకులపై మఫ్టీలో దాడి చేశారని ఆరోపించారు. వచ్చిన ఫిర్యాదు ఏవారంటూ ఏమీ చూపించకుండా దాడి చేశారని మండిపడ్డారు. పోలీసుల ముసుగులో రౌడీలతో దాడులు చేశారని ఆరోపణలు గుప్పించారు.
Read also: Crime News: దారుణం.. పట్టపగలే తుపాకీతో మహిళను బెదిరించి మరీ..
కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డాటాను మొత్తం చోరీ చేశారని ఆరోపణ చేశారు. గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కాంగ్రెస్ కార్యకర్తల డాటా అందులో ఉందని అన్నారు. రాష్ట్ర పోలీస్ అధికారులకు ఫోన్ చేసిన కనీసం స్పందించట్లేదని మండిడపడ్డారు. పార్లమెంటు సభ్యుడిగా ఫోన్ చేస్తే కనీసం లిఫ్ట్ చేయరని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర పోలీసులు పోలీసులా లేకపోతే దొంగలా అంటూ ప్రశ్నించారు రేవంత్. పోలీసులు కిరాయి గుండాల లాగ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పాదయాత్రకు మంచి స్పందన వస్తోందని అన్నారు.
పాదయాత్రలో ఆయన లేవనెత్తుతున్న అంశాలు నచ్చకనే నరేంద్ర మోడీకి , కేసీఆర్ కి ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ స్ట్రాటజీ టీం పై దాడి చేశారంటే.. రాహుల్ గాంధీ పాదయాత్రలో ఏం మాట్లాడాలో ఈ స్ట్రాటరి టీం చెప్తుందని రేవంత్ హెచ్చరించారు. హైదరాబాద్ కమిషనర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. ఈ అంశంపై పార్లమెంట్లో మాట్లాడుతాం.. ఈ అంశాన్ని జాతీయస్థాయిలో చర్చ జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. కేసీఆర్ ఆగడాలను దేశ ప్రజలకు తెలియజేస్తామన్నారు.
కాంగ్రెస్ ఎంపీ ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పును రాష్ట్ర పోలీసులు ఉల్లంఘించారని అన్నారు. కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కాంలో ఇన్వాల్వ్ ఉందని దేశవ్యాప్తంగా అందరికీ తెలుసన్నారు. కవిత లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ ఉందని ఒక ఫేస్బుక్ పోస్టు పెట్టామన్నారు. ఆ ఫేస్బుక్ పోస్టు వల్ల రాష్ట్ర పోలీసులకు ఏమి ఇబ్బంది కరం అని ఆయన ప్రశ్నించారు.
Karnataka: హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయి లవ్.. 18 మంది విద్యార్థులు సస్పెండ్