రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ల మధ్య రగులుతున్న రాజకీయ వివాదాల గురించి తెలిసిందే. ఈ గొడవల మధ్య రాజస్థాన్ ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Chiranjeevi in Congress: మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.. రీ ఎంట్రీ తర్వాత సినిమాల్లో బిజీ అయిపోయారు.. వరుస సినిమాలు చేస్తున్నారు.. ఈ మధ్యే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ వసూళ్లలో సత్తా చాటుతోంది.. అయితే, ఆ మధ్య చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమాలో ”నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను.. కానీ, రాజకీయం నా నుంచి దూరం కాలేదు” అంటూ ఓ డైలాగ్ ఉంది.. అలాగే ఉంది ఇప్పుడు చిరంజీవి పరిస్థితి..…
Chinta Mohan: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో ఏపీ కాపు అభ్యర్థి సీఎం కావడం ఖాయమని స్పష్టం చేశారు. కాపు ముఖ్యమంత్రిని చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుందని తెలిపారు. 175 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని.. 100 స్థానాల్లో గెలుపు తథ్యమని జోస్యం చెప్పారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు. రోజు రోజుకు ప్రధాని…
Tulasi Reddy: ఏపీలో ప్రభుత్వ శాఖలకు సలహాదారులపై నియామకంపై ఇటీవల హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ నేత తులసిరెడ్డి కూడా ఏపీ ప్రభుత్వ సలహాదారులపై తీవ్ర విమర్శలు చేశారు. వీరు సలహాదారులు కాదని.. స్వాహాదారులు అని ఆరోపించారు. ప్రభుత్వ అధికారుల కంటే వీరు మంచి సలహాలు ఇస్తారా అని తులసిరెడ్డి ప్రశ్నించారు. వైసీపీ నాయకులకు సలహదారుల వ్యవస్థ ఉపాధి హామీ పథకం వంటిదని చురకలు అంటించారు. సలహాదారుల పేరుతో జగన్ తన…
OFF The Record: వనపర్తిలో కాంగ్రెస్ రాజకీయం రోడ్డున పడింది. కాంగ్రెస్ సీనియర్ నేతకు వ్యతిరేకంగా ఆందోళనలకు దిగుతున్నారు పార్టీ నాయకులు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌కే.. క్రమశిక్షణ లేదని ఆందోళనకు దిగారు. ఇంతకీ ఎందుకీ రచ్చ? వనపర్తి కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది? కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డికి ఎర్త్ పెడుతుంది ఎవరు? చిన్నారెడ్డికి అంతకోపం ఎందుకు వచ్చింది? రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే చిన్నారెడ్డికి అసలేమైంది? వనపర్తిలో గడిచిన కొన్నిరోజులుగా సీనియర్ కాంగ్రెస్ నేత చిన్నారెడ్డికి.. స్థానిక…
కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే.. అందులో ఉన్న పొరపాట్లను అధిష్టానానికి ఎత్తిచూపుతూ వచ్చిన సీనియర్ రాజకీయ నాయకుడు గులాంనబీ ఆజాద్.. ఈ ఏడాది ఆగస్టు 26న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అక్టోబర్‌లో డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అయితే, ఈ క్రమంలో గులాంనబీ మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరనున్నాడనే ప్రచారం తెరపైకి వచ్చింది.. ఇదే సమయంలో.. ఆయన…
భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా జనవరి 26 నుంచి జరిగే హత్ సే హాత్ జోడో కార్యక్రమానికి రాష్ట్రాల పరిశీలకులను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియమించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుంచి దిగ్విజయ్ తాజ్ కృష్ణ హోటల్‌కు చేరుకున్నారు.