గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు కారెక్కేశారు. అక్కడ కాంగ్రెస్ సీటు ఖాళీగా ఉందని భావించిన నాయకులు కర్చీఫ్‌లు వేస్తున్నారు. టికెట్ కోసం తన్నుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఎవరి స్థాయిలో వారు కుంపట్లు రాజేస్తూ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదెక్కడో.. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. పరస్పరం ఆధిపత్య పోరాటం కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన పట్టు ఉండేది. గత ఎన్నికల్లో ఇక్కడ గెలిచింది కూడా కాంగ్రెస్సే. ప్రస్తుతం టీఆర్ఎస్‌లో ఉన్న వనమా…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొత్త కమిటీల నియామకం చిచ్చుపెట్టింది.. కొత్త కమిటీల్లో ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలను పక్కనబెట్టి.. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెట్టారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.. ఈ వ్యవహారంపై సీనియర్లు గుర్రుగా ఉన్నారు.. ఈ పరిస్థితులకు నిరసనగా ఇప్పటికే పలువురు పార్టీ పదవులకు రాజీనామా చేస్తే.. సీనియర్లు సమావేశం కావడం.. పీసీసీ కమిటీలపై బహిరంగంగానే మాట్లాడుతుండడం.. గందరగోళానికి దారితీసింది.. తాజాగా కాంగ్రెస్ అసమ్మతి నేతలంతా సీఎల్పీ నేత…
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్మలాటలు, నేతల మధ్య వర్గపోరు, అవి బహిర్గతం అవ్వడం.. ఆ తర్వాత సర్దుకుపోవడం.. ఎన్నికల సమయంలో కలిసి పనిచేయడం.. కొన్ని సార్లు మంచి ఫలితాలు వస్తే.. మరికొన్ని సార్లు నష్టపోవడం.. చూస్తూనే ఉన్నాం.. అయితే, ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొత్త కమిటీల నియామకం చిచ్చుపెడుతోంది.. కొత్త కమిటీల్లో ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలను పక్కనబెట్టి.. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెట్టారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి..…
వలస వాదులతో అసలు వారికి నష్టం జరిగిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కాంగ్రెస్ లో పుట్టి. పెరిగి భావజాలం నమ్మిన అనేక మందికి కమిటీ ఏర్పాటులో ఇబ్బంది ఏర్పడిందని అన్నారు.
Rahul Gandhi : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర నేటితో వంద రోజలు పూర్తి చేసుకోనుంది.
పోలీసుల ముసుగులో రౌడీలతో దాడులు చేశారని, పోన్ లు చేస్తే కనీసం లిప్ట్ చేయరని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలకు చట్టాల పట్ల ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.