తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, రాజ్యాంగ నియమాలను ఉల్లంఘిస్తోందని ఆయన ఆరోపించారు.
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసుపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఈ కేసు 'లొట్టపీసు కేసు' అని, ఇందులో ఎలాంటి స్కాం జరగలేదని ఆయన అన్నారు.
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో శనివారం ఘనంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎక్సైజ్–పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, యువజన–క్రీడల, పశువర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి రెండు ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు.
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి స్మారక అవార్డుల ప్రదానోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైఎస్సార్‌తో తనకున్న అనుబంధాన్ని, ఆయన పాలన స్ఫూర్తిని గుర్తుచేసుకున్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో కాంగ్రెస్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గత రెండు నెలలు గా యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల రైతులు దయనీయ పరిస్థితుల్లో ఉన్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు.
Harish Rao : బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై ప్రభుత్వం చూపిన వైఖరి అవమానకరమని, సిగ్గుచేటని ఆయన అన్నారు. ఈ ఘటనకు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, గృహశాఖ బాధ్యతలు కూడా చేపట్టిన వ్యక్తిగా, నిస్సందేహ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. “మహిళా ఎమ్మెల్యేను బహిరంగంగా అవమానించడానికి, వేధించడానికి ఒక మంత్రి సమక్షంలోనే అనుమతించడం ఏమిటి? అంతేకాదు, పోలీసుల…
Ramchander Rao : తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై విచారణ కమిషన్ నివేదిక హాట్ టాపిక్‌గా మారింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతున్న వేళ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఈ అంశంపై స్పందించారు. నివేదిక లీకులపై తమకు ఎలాంటి ఆసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. “ప్రభుత్వం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాతే మేము స్పందిస్తాం. ఇప్పుడే బయటకు వస్తున్న ఈ నివేదిక ప్రభుత్వానిదా? లేక కాంగ్రెస్‌దా?” అని ఆయన…
Duddilla Sridhar Babu : మంథని నియోజకవర్గంలో అర్హులైన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. ఈ సందర్భంగా ఆయన పలు ముఖ్య ప్రకటనలు చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై వివరించారు. “రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం పంపిణీకి నాంది పలికింది. ప్రతి అర్హ కుటుంబం సకాలంలో సన్న బియ్యం పొందేలా చర్యలు తీసుకుంటున్నాం,” అని…
తనను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్కౌంటర్ చేయాలని ప్లాన్ చేసినట్లు ఎమ్మెల్యే రాజాసింగ్ వెల్లడించారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. నాడు జరిగిన సంచలన విషయాలను వివరించారు. తాను హిందు వాహినిలో చేరి యువతను ధర్మం వైపునకు వచ్చేలా చర్యలు కార్యక్రమాలు చేపట్టానని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో తమ కార్యక్రమాలకు ఎప్పుడూ ఏదో ఒక గొడవ సృష్టించేవారని, తాము ఎక్కడికి వెళితే అక్కడ 144 సెక్షన్ అమలు చేసేవారని రాజాసింగ్ తెలిపారు.
రాబోయే ఐదు రోజుల్లోనే రైతులకు ధాన్యం కొనుగోలుకు 500 రూపాయల బోనస్ ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో ప్రజా పాలన ప్రగతి బాట కార్యక్రమంలో పాల్గొన్న రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 16 లక్షల మంది లబ్ధిదారులని పొందుపరిచామని వెల్లడించారు.