KCR : ఇంత చేతగాని దద్దమ్మ ప్రభుత్వమా..?
- అభివృద్ధి, సంక్షేమం స్తంభించిందన్న కేసీఆర్
- పాత పథకాలను ఆపేశారని విమర్శ
- సాగునీటి హక్కులపై ప్రభుత్వం విఫలమైందన్న ఆరోపణ
- ఎన్నికల ఫలితాలే ప్రజావ్యతిరేకతకు నిదర్శనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KCR : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమం “సడి లేదు సప్పుడు లేదు” అన్న చందంగా తయారయ్యాయని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్‌లో జరిగిన పార్టీ కీలక సమావేశంలో పాల్గొన్న ఆయన, ప్రస్తుత ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఒక్క పథకాన్ని కూడా ప్రజల కోసం తీసుకురాలేదని, పైగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన అనేక ప్రజా సంక్షేమ పథకాలను నిలిపివేసిందని కేసీఆర్ ఆరోపించారు. కేసీఆర్ కిట్, బస్తీ దవాఖానాలు వంటి పథకాలను నిర్వీర్యం చేస్తూ, ప్రజలకు అందుతున్న ఫలాలను దూరం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
ముఖ్యంగా రైతులు మళ్లీ యూరియా కోసం క్యూ లైన్లలో నిలబడే దుస్థితికి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలని మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెడుతోందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి దక్కాల్సిన వాటా విషయంలో ఢిల్లీ స్థాయిలో పోరాడటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు.
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
పాలమూరు-రంగారెడ్డి వంటి కీలక ప్రాజెక్టులను గాలికి వదిలేశారని, దీనిపై బిఆర్ఎస్ పార్టీ ఊరుకోదని, ప్రజల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, ఈ వ్యతిరేకత ఇప్పటికే ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోందని కేసీఆర్ అన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని, రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకుని, ప్రజల మద్దతుతో తిరిగి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
KCR: చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యే RDX బాంబులు పెట్టి పేల్చిండు
తాజావార్తలు
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!