నేటి నుంచి జీఎస్టీ 2.o అమల్లోకి రానుంది.. ఇవాళ్టి నుంచి అమల్లోకి జీఎస్టీ కొత్త శ్లాబ్‌లు అమలు చేస్తున్నారు.. దీంతో, పలు రకాల వస్తువుల ధరలు తగ్గనున్నాయి.. జీఎస్టీ కౌన్సిల్ 2025 సెప్టెంబర్ 3న చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై రెండు ప్రధాన పన్ను స్లాబులు 5 శాతం, 18 శాతం మాత్రమే ఉంటాయి. అదనంగా, విలాస వస్తువులపై 40 శాతం ప్రత్యేక పన్ను విధించనున్నారు.
రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును తగ్గించి మధ్యతరగతికి పెద్ద ఉపశమనం కలిగించింది. శుక్రవారం ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం తర్వాత కేంద్ర బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమాచారాన్ని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అందించారు. కేంద్ర బ్యాంకు రెపో రేటును 0.25% (25 బేసిస్ పాయింట్లు) తగ్గించిందని ఆయన అన్నారు. ఈ కోత తర్వాత, రెపో రేటు 6.50% నుంచి 6.25%కి తగ్గింది.
ప్రస్తుత కాలంలో ఇంట్లో కుక్కలను పెంచుకోవడం ఒక ట్రెండ్‌గా మారింది. సెలబ్రిటీల నుంచి కామన్ మ్యాన్ వరకూ అందరూ వివిధ రకాల కుక్కల, పిల్లులను పెంచుకుంటున్నారు. కొంత మంది కుక్కలను పెంచుకోవడం ఒక స్టేటస్ సింబల్‌గా భావిస్తారు. మరి కొందరు రక్షణ కోసం వాటిని పెంచుకుంటారు. అయితే.. ఈ పెంపుడు జంతువుల వల్ల మనుషులకు చాలా ప్రమాదమట. ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి గురించి పూర్తిగా తెలుసుకుందాం.. READ MORE:…
కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్మాణాత్మక చర్యల కారణంగా సామాన్యుల జీవన ప్రమాణాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకోబోతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన కౌటిల్య ఎకనామిక్ సదస్సుల్లో నిర్మలా సీతారామన్ పాల్గొని మాట్లాడారు.. వచ్చే ఐదేళ్లలో భారత్‌లో తలసరి ఆదాయం రెట్టింపవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Prices: దసరా, దీపావళి పండగల వేళ నిత్యావసరాలు, కూరగాయల ధరలు ఆకాశానికి తాకుతున్నాయి. సామాన్య ప్రజలు ఏం కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఏ దుకాణానికి వెళ్లినా ధరల భారం తప్పడం లేదని మహిళలు అంటున్నారు.
గత కొద్దిరోజులుగా గ్యాస్ సిలిండర్ ధరలు ఆకాశానికి నిచ్చెన వేశాయి. పెట్రోల్, నిత్యావసరాల ధరల మంటతో అల్లాడుతున్న సామాన్యుల నెత్తిన కేంద్రం మరో పిడుగు వేసింది. ఇంట్లో వాడే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్‌పై రూ. 50 ధర పెంచింది. ఈ ధరలు నిన్నటినుంచే అమల్లోకి వచ్చినట్టు చమురు సంస్థలు తెలిపాయి. హైదరాబాద్‌లో వంటగ్యాస్ సిలిండర్ ధర రూ. 1,052కి చేరింది. ఆరువారాల వ్యవధిలో 14 కిలోల వంటగ్యాస్ సిలిండర్‌పై ధరలు పెంచడం ఇది రెండోసారి. మార్చి…
ఏపీలో వరుసగా ఛార్జీల మోత మోగుతోంది. తాజాగా ఏపీఎస్ ఆర్టీసీ ఛార్జీలను పెంచింది ప్రభుత్వం. ఇప్పటికే బాదుడే బాదుడు అంటే విపక్షాలు నిరసనలకు దిగాయి. ఇది ప్రజల పట్ల బాధ్యత కలిగిన ప్రభుత్వం కాదు.. ప్రజలను బాదే ప్రభుత్వం అన్నారు జనసేన పీఎసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. ఏపీఎస్సార్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకున్నామని ప్రచారం చేసుకున్నారు. వైసీపీ నాయకత్వం ఇప్పుడు ఆర్టీసీ ప్రయాణాన్ని సంక్షేమ పథకంగా ఎందుకు భావించడం లేదు? ఆర్టీసీ బస్సుల్లో రోజుకు సగటున 70…
కరోనా మహమ్మారి తర్వాత పెళ్ళిళ్ళు బాగా పెరిగాయి. అయితే ఈ పెళ్ళి వేడుకల్లో విచిత్రమయిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో ఉల్లిధరలు పెరిగినప్పుడు ఉల్లి దండలు బహుమతులుగా ఇచ్చేవారు. కొత్తగా పెళ్లయినవారికి ఉల్లిపాయలు పెట్టి గిఫ్ట్ బాక్సులు అందించేవారు. ఇప్పుడు పెట్రోల్, డీజిల్.. ధరలంటే జనాలు భయపడిపోతున్నారు. రోజుకి ఇంచుమించుగా రూపాయి పెంచుతూ చమురు సంస్థలు వినియోగదారులను ఎడాపెడా బాధేస్తున్నాయి. https://ntvtelugu.com/viman-restaurant-viral-in-vijayawada/ ఓ వివాహ వేడుకలో నూతన వధూవరులకు వారి స్నేహితులు ఇచ్చిన గిఫ్ట్ సోషల్ మీడియాలో వైరల్…