కరోనా మహమ్మారి తర్వాత పెళ్ళిళ్ళు బాగా పెరిగాయి. అయితే ఈ పెళ్ళి వేడుకల్లో విచిత్రమయిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో ఉల్లిధరలు పెరిగినప్పుడు ఉల్లి దండలు బహుమతులుగా ఇచ్చేవారు. కొత్తగా పెళ్లయినవారికి ఉల్లిపాయలు పెట్టి గిఫ్ట్ బాక్సులు అందించేవారు. ఇప్పుడు పెట్రోల్, డీజిల్.. ధరలంటే జనాలు భయపడిపోతున్నారు. రోజుకి ఇంచుమించుగా రూపాయి పెంచుతూ చమురు సంస్థలు వినియోగదారులను ఎడాపెడా బాధేస్తున్నాయి.
ఓ వివాహ వేడుకలో నూతన వధూవరులకు వారి స్నేహితులు ఇచ్చిన గిఫ్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ జంటకు మిత్రులంతా కలిసి షాకిచ్చారు. లీటర్ పెట్రోల్, డీజిల్ బహుమతిగా ఇచ్చారు. పెట్రో ధరలు మండిపోతున్న వేళ వారిచ్చిన గిఫ్ట్ ఆలోచింపచేసింది. తమిళనాడులోని చంగల్‌పట్టు జిల్లా చెయ్యూరులో గిరీశ్ కుమార్, కీర్తన జంట వివాహ వేడుక జరిగింది. మిత్రులు, కుటుంబ సభ్యులు ఆజంటను ఆశీర్వదిస్తున్నారు. వారి స్నేహితులు ఓ కవర్‌లో నుంచి రెండు లీటర్ బాటిళ్లు తీశారు.. పెట్రోల్, డీజిల్‌తో ఉన్న ఆ బాటిళ్లను ఇద్దరి చేతిలో పెట్టి వారిని సర్‌ప్రైజ్ చేశారు. వీరి గిఫ్ట్ చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు పెళ్లికోసం బంధువులు.