రేపు మధ్యాహ్నం (శుక్రవారం) సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంలో భాగంగా.. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది.. ఈ నెల 6వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు.. అయితే, మంగళగిరిలోని సీసీఎల్ఏ కార్యాలయంలో జిల్లా కలెక్టర్లు.. జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఏపీ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు..
Bhatti Vikramarka: సమగ్ర సర్వేలో డేటా ఎంట్రీ దశ చాలా ముఖ్యమైందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాంచీ నుంచి ఉన్నతాధికారులు, కలెక్టర్లతో సమగ్ర కుటుంబ సర్వేపై వీడియో కాన్ఫరెన్స్ లో భట్టి విక్రమార్క మాట్లాడారు.
అధికారులతో సీఎస్ శాంతికుమారి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. మరో మూడు రోజుల పాటు వర్షాలు ఉన్న క్రమంలో.. జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జిల్లాల్లో ఏ విధమైన ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా కలుగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు. ముందుగానే పునరావాస కేంద్రాల ఏర్పాటు పై చర్యలు తీసుకోవాలని.. పోలీస్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, అగ్నిమాపక శాఖ, NDRF,…
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానున్నారు. సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే సమావేశంలో ప్రధానంగా తొమ్మిది అంశాలపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా కలెకర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఏపీ సర్కార్ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఇవాళ (మంగళవారం) ఉత్తర్వులు జారీ చేశారు.
Minister Komatireddy: నేడు సెక్రటేరియట్ లో పలువురు కలెక్టర్లతో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశం నిర్వహించనున్నారు. జిల్లాలో రోడ్ల మరమ్మతులు..
ఆంధ్రప్రదేశ్లో మూడు జిల్లాలకు కలెక్టర్లు, ఐదు జిల్లాలకు ఎస్పీల నియామకం జరిగింది. ఇటీవల కొందరు జిల్లా ఎస్పీలు, కలెక్టర్లపై ఎన్నికల కమిషన్ బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. ముగ్గురు ఐఏఎస్లతోపాటు, 6గురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది.