Minister Komatireddy: నేడు సెక్రటేరియట్ లో పలువురు కలెక్టర్లతో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశం నిర్వహించనున్నారు. జిల్లాలో రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్ల ప్రతిపాదనలు, త్రిబుల్ ఆర్ భూసేకరణ వంటి అంశాలపై చర్చించనున్నారు. కాగా.. మంత్రి కోమటిరెడ్డి నిన్న తెలంగాణ సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో నిర్మిస్తున్న జాతీయ రహదారులు, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రోడ్లు, సిఆర్ఐఎఫ్ రోడ్లు, పనుల పురోగతులపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
అనంతరం మాట్లాడుతూ.. రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్ ను ఇండస్ట్రియల్ హబ్ గా మార్చారన్నారు. మూడున్నర ఏళ్లలో RRR పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నామని తెలిపారు. వర్షాకాలం ప్రారంభం అయ్యేలోపు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు మరమ్మత్తులు చేయాలని అదేశించామని వెల్లడించారు. విజయవాడ రోడ్డు అనగానే డెత్ రోడ్డు అనే పేరు ఉందన్నారు. డిసెంబర్ లోపు సిక్స్ లైన్ రోడ్డు పనులను మొదలు పెట్టుకోవాలని టార్గెట్ పెట్టుకున్నామని తెలిపారు. నేటి నుంచి ఫుల్ టైం యాక్షన్ లోకి దిగుదామని, కేంద్రం నుంచి నిధులు తెస్తామన్నారని ఆయన వ్యాఖ్యానించారు.
Read also: Balkampet Yellamma: జూలై 9న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం.. 81 రోజుల హుండీ ఆదాయం ఎంతంటే..
తెలంగాణలో ఎక్కువశాతం రోడ్లను జాతీయ రహదారులుగా మార్చేందుకు కృషి చేస్తామని మంత్రి అన్నారు. పార్లమెంట్ లో ఇండియా కూటమి బలం ఉందని తెలిపారు. కేంద్రంపై ఒత్తిది చేస్తామని అన్నారు. ఉప్పల్ ఫ్లైఓవర్, కొంపల్లి ఫ్లైఓవర్, అంబర్ పేట పనులు ఏళ్ల తరబడి జరుగుతున్నాయని అన్నారు. మూడు నెలల్లో అంబర్ పేట పూర్తి చేసేలా ఆదేశాలు జారీ చేశామన్నారు. తెలంగాణ భవనం ఢిల్లీలో 24 అంతస్తుల నిర్మించడం కూడా జరుగుతుందన్నారు. డీపీఆర్ రెడీ అవుతుందని తెలిపారు. హైదరాబాద్ దుర్గం చెరువు కేటీఆర్ కేవలం సెల్ఫీ కోసమే పనికొస్తుందన్నారు.
ఒక గంట అక్కడ ఉంటే హాస్పటల్ పాలు అవ్వడం ఖాయమన్నారు. హైదరాబాద్ విజయవాడ, హైదరాబాద్ టు బెంగుళూర్ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు 5600 కోట్లతో రోడ్డు సాధిస్తామన్నారు. బకాయిలు అనేది పెద్ద సమస్య, పెద్ద రాష్ట్రం తెలంగాణ అన్నారు. బకాయిలు తీర్చడానికి కార్పొరేషన్ పెట్టీ ముందుకు వెళ్తామన్నారు. కేసీఆర్ మోడీతో వ్యక్తిగత పంచాయితీ ఉన్నట్లు గత ప్రభుత్వం వ్యవహరించిందని తెలిపారు. అక్టోబర్ లో ఫౌండేషన్, డిసెంబర్ లోపు ఆర్ఆర్ఆర్ ప్రారంభించాలని అనుకుంటున్నామని వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఆరోగ్యశాఖతో కలిసి మరోసారి సమీక్ష చేస్తామన్నారు.
Plane Crash: విమానానికి తప్పిన ప్రమాదం.. ఇంజిన్ లో మంటలు..