CM Revanth Reddy: జూలై 16న కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఈనెల 16న ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే సమావేశంలో ప్రధానంగా తొమ్మిది అంశాలపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు పాల్గొన్నారు. బదిలీల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఉన్నతాధికారులు బదిలీ అయిన నేపథ్యంలో ఈ సమావేశం జరగనుంది. ప్రధానంగా పాలన, వ్యవసాయం, వైద్యం, ఆరోగ్యం, వనమహోత్సవం, మహిళాశక్తి, విద్య, శాంతి భద్రతలు, మాదక ద్రవ్యాల నిర్మూలన తదితర అంశాలపై సమావేశం జరగనుంది. కాగా.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు.
Read also: Lavanya Lawyer: అలా చేస్తే 10 ఏళ్లు జైలు శిక్ష.. లావణ్య లాయర్ సంచలన వ్యాఖ్యలు..
నిన్న సచివాలయంలో ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్, మైనింగ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రవాణా శాఖల అధికారులు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కుడు, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టే అన్ని శాఖల నిర్ణీత వార్షిక లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇసుక, ఖనిజ వనరుల ద్వారా ఆదాయం పెరగాలంటే అక్రమ రవాణా, లీకేజీలను అరికట్టాలని సూచించారు. గత ఆర్థిక సంవత్సరం కంటే ఈ ఏడాది ఎక్కువ ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పన్ను ఎగవేతలకు తావులేకుండా అన్ని శాఖలు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఇక నుంచి ప్రతినెలా మొదటి వారంలో నిర్ణీత ఆదాయ లక్ష్యాలపై సమీక్ష నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపిన విషయం తెలిసిందే.
Today Gold Price: వరుసగా రెండోరోజు.. భారీ షాక్ ఇచ్చిన బంగారం ధరలు!