ధరణి పునర్నిర్మాణ కమిటీ ఇవాళ సచివాలయంలో ఐదు జిల్లాల కలెక్టర్లతో సమావేశం కాబోతుంది. రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల కలెక్టర్లను ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఇప్పటికే వారికి సమాచారం పంపింది.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో అంగన్వాడీలకు కలెక్టర్లు నోటీసులు ఇచ్చారు. గత 22 రోజులుగా అంగన్వాడీలు చేస్తున్న ఆందోళనను నిలిపివేయాలంటూ నోటీసులు జారీ చేశారు. అంగన్వాడీల ఆందోళనతో పిల్లలకు పోషకాహార లోపం ఏర్పడుతుందని వారు తెలిపారు. గతంలో అనేక సందర్భాల్లో అంగన్వాడీల కోరికలను ప్రభుత్వం పరిష్కరించిందని అన్నారు. అంగన్వాడీల సమ్మెతో పిల్లలు, గర్భిణీ స్త్రీలు వంటి వారికి పౌష్టికాహారం అందించేందుకు ఇబ్బందులు వస్తున్నాని చెప్పారు. ఈ క్రమంలో.. అంగన్వాడీలు జనవరి ఐదు లోపు విధులకు హాజరు కావాలని జిల్లా…
ఈనెల 21న కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి భాద్యతలు తీసుకున్న తర్వాత జరుగుతున్న తొలి కాన్ఫరెన్స్. ఈ కాన్ఫరెన్స్ కు కలెక్టర్లంతా సిద్ధంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. భూ రికార్డులతో ముడిపడిన సమస్యలతో పాటు.. కౌలు రైతుల గుర్తింపు వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా.. కొత్త రేషన్ కార్డుల జారీ, మహాలక్ష్మి వంటి పథకాల అమలుపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ పాలనా వ్యవస్థపై ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. భారీగా పలు శాఖల ఉన్నతాధికారులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు వేసింది. విధి నిర్వహణలో అలసత్వం, నిర్లక్ష్యం కారణంగా బదిలీ వేటు వేసినట్లు తెలిసింది.
తెలంగాణలో ఇవాళ పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హెచ్చరించింది.
తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జగనన్నకు చెబుదాం, గడపగడపకూ మన ప్రభుత్వం, ఉపాధిహామీ పనులు, హౌసింగ్, వ్యవసాయం- సాగునీరు విడుదల, జగనన్న భూ హక్కు- భూ రక్ష కార్యక్రమాలపై సీఎం సమీక్ష చేశారు.
సాధారణంగా వీకెండ్ సెలవులు వస్తే ఎవరైనా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తారు. దీనికి చిన్నా, పెద్ద అనే తేడా ఉండదు. అయితే ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు మాత్రం వీకెండ్ సెలవులలో ఇంట్లో సేదతీరకుండా పొలం వైపు అడుగులు వేశారు. ఏపీలోని బాపట్ల జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఇద్దరూ తమ భార్యాపిల్లలతో కలిసి పొలంలో చెమట చిందించారు. రైతులతో పాటు వీళ్లు కూడా పొలంలో పనిచేశారు. ఈ సందర్భంగా బాపట్ల మండలం…