Minister Anagani Satya Prasad: ఈ నెల 6 నుండి రెవెన్యూ సదస్సులు.. కలెక్టర్లకు కీలక సూచనలు
- ఈ నెల 6వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు..
- జిల్లా కలెక్టర్లు.. జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్..
- కీలక సూచనలు చేసిన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Anagani Satya Prasad: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది.. ఈ నెల 6వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు.. అయితే, మంగళగిరిలోని సీసీఎల్ఏ కార్యాలయంలో జిల్లా కలెక్టర్లు.. జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఏపీ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.. ఈ నెల 6వ తేదీ నుండి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్న నేపథ్యంలో.. కలెక్టర్లకు కీలక సూచనలు ఇచ్చారు మంత్రి అనగాని సత్యప్రసాద్.. అన్ని రకాల భూ సమస్యలపై రెవెన్యూ సదస్సులో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని స్పష్టం చేశారు.. భూ వివాదాలకు ముగింపు పలికే విధంగా రెవెన్యూ సదస్సులు జరగాలని ఆదేశాలు జారీ చేశారు.. రెవెన్యూ సదస్సులను మొక్కుబడి కార్యక్రమంలా మార్చవద్దంటూ.. అధికారులకు హెచ్చరించారు.. రెవెన్యూ సదస్సులో భూ దురాక్రమణులు, 22a భూముల ఉల్లంఘన పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు ఏపీ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్.
Read Also: Varun Dhawan : కీర్తి సురేష్‌కు బాలీవుడ్ లో వేరే లెవల్ ఎంట్రీ
Also Read
- AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
- AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
- AP Heavy Rain Alert: తీరంవైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. దంచికొడుతున్న వానలు..
- AP Social Media Influencer Policy: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు సర్కార్ గుడ్‌న్యూస్.. ఫాలోవర్లను బట్టి పారితోషికం..
రాష్ట్రాన్ని పునర్నిర్మించాలి, పేదలకు భవిష్యత్తు ఇవ్వాలని సీఎం చంద్రబాబు పని చేస్తున్నారని తెలిపారు అనగాని.. గత ప్రభుత్వంలో క్షేత్రస్ధాయిలో భూ సమస్యలు సృష్టించారు.. ఆర్ధికంగా దోచుకునే పథకాలే తప్ప పేదవాడికి ఉపయోగపడే పనులు చేయలేదని విమర్శించారు.. 67 వేల గ్రీవెన్స్‌లు రెవెన్యూలోనే వచ్చాయి… గ్రీవెన్సులు అన్నీ అక్కడి సమస్యలు అక్కడికక్కేడే పరిష్కరించేలా రెవెన్యూ సదస్సు నిర్వహించాలన్నారు.. 2018 తరువాత మరల రెవెన్యూ సదస్సులు పెట్టలేదు.. ఈ నెల 6 నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు 17,500 గ్రామాలలో రెవెన్యూ సదస్సులు జరుగుతాయి.. 22a కింద పెట్టిన వాటికి కూడా న్యాయం చేసేలా ఈ సదస్సుల్లో పరిష్కరిస్తాం అని స్పష్టం చేశారు.. అన్యాక్రాంతం అయిన వాటిని కూడా అసలు యజమానిని డిస్ప్లే చేసి రెవెన్యూ సదస్సులో పరిష్కరిస్తాం.. రెవెన్యూనే కాకుండా హౌసింగ్ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి.. గత ప్రభుత్వం వారి కార్యకర్తలకే భూములిచ్చింది.. అర్హులై స్ధలాలు లేని వారికి భూములు, నూతన రేషన్ కార్డులు ఇచ్చేలా ఒకేదగ్గర పరిష్కరిస్తాం అన్నారు. లీజుకు తీసుకున్న వాటి వినియోగంపై ఒక నిర్ణయం రెవెన్యూ సదస్సులలో తీసుకుంటాం అన్నారు ఏపీ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!