కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. వరద బాధితులను గడపగడపకు వెళ్లి పరామర్శిస్తున్నారు.. ప్రతి ఇంటికీ నష్టపరిహారం, నిత్యవసరాలు అందించామని తెలిపారు.. ఏఒక్కరూ మాకు సాయం అందలేదు అనడం లేదు.. పశువులకు నోరు ఉంటే అవి కూడా మెచ్చుకునేలా సహాయం చేశామన్నారు.. ముఖ్యమంత్రి అంటే ఆదేశాలు ఇవ్వాలి, వరదల్లో నేను వచ్చుంటే అధికారులు నాచుట్టూ తిరిగేవారు , ఫోటోల్లో టీవీల్లో బాగా కనిపించేవాడిని.. కానీ, నేను అలా కాదు.. వారంరోజులు టైమ్ ఇచ్చి వచ్చానని…
పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో-ఆర్డినేటర్లతో జరిగిన సమావేశమైన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఇక నుంచి పార్టీకే పెద్ద పీట వేస్తానని చెప్పారు. పనులన్నీ అనుకున్న సమయానికే పూర్తి కావాలని స్పష్టం చేశారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా అడుగులు వేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు సీఎం వైఎస్ జగన్.. ఆగస్టు 4 నుంచి ప్రతి నియోజకవర్గానికి చెందిన 50 మంది కీలక కార్యకర్తలతో భేటీ…
జాతీయ పతాక రూపకర్త స్వర్గీయ పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి కన్నుమూశారు.. ఆమె వయస్సు వందేళ్లు.. ప్రస్తుత పల్నాడు జిల్లా మాచర్లలోని ప్రియదర్శిని కాలనీ నివాసం ఉంటున్న ఆమె.. గురువారం రాత్రి ప్రాణాలు విడిచారు.. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు.. అయితే, సీతామహాలక్ష్మీ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఆమె అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కాగా,…
రాష్ట్రా రూపురేఖలే కాదు.. పోర్టులు ఉన్న ప్రాంతాల రూపురేఖలు త్వరలోనే మారబోతున్నాయని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. రామాయపట్నం పోర్టు పనులకు భూమిపూజ చేసిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు.. చెన్నై అయినా, విశాఖ అయినా, ముంబై అయినా మహానగరంగా ఎదిగాయంటే అక్కడ పోర్టులు ఉన్నాయని గుర్తుచేసిన ఆయన.. పోర్టు రావడం వల్ల ఉద్యోగావకాశాలు వస్తాయి, ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయి, పోర్టు వల్ల ట్రాన్స్‌పోర్టు ఖర్చుకూడా బాగా తగ్గుతుంది.. రాష్ట్రానికే కాదు,…
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఎన్నికలు వచ్చే అవకాశం లేకపోయినా.. ఓట్లు, సీట్ల గురించి సవాళ్లు, ప్రతి సవాళ్లు వినిపిస్తున్నాయి.. గత ఎన్నికల్లో సాధించిన సీట్ల కంటే.. ఈ సారి ఎక్కువగా వస్తాయని.. రాష్ట్రంలోని 175 స్థానాలకు 175 తామే గెలుస్తామని అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు చెబుతున్నమాట.. అయితే.. రానున్న ఎన్నికలలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి 175 కాదు కదా.. 17 సీట్లు కూడా రావు అని జోస్యం చెప్పారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రోత్సాహంతోనే హత్యా రాజకీయాలు జరుగుతున్నాయని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. పల్నాడు జిల్లా, రొంపిచర్ల మండల తెలుగుదేశం అధ్యక్షుడు వెన్నా బాల కోటిరెడ్డిపై అలవల గ్రామంలో జరిగిన దాడి ఘటనను సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా ఖండించిన ఆయన.. ఉదయాన్నే వాకింగ్ కు వెళ్లిన వ్యక్తిపై గొడ్డళ్ళతో దాడి చేశారంటే ఏపీలో శాంతి భద్రతల రక్షణ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? నిద్రపోతున్నాయా? అని ప్రశ్నించారు.. తెలుగుదేశం కార్యకర్తలు, నేతల హత్యలకు జగన్ ప్రోత్సాహం ఉంది కాబట్టే.. వైసీపీ నేతలు…
అర్హులై సంక్షేమ పథకాలు అందని రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పారు ఏపీ సీఎం వైఎస్ జగన్.. అర్హులై వివిధ కారణాల వల్ల ప్రభుత్వ పథకాలు పొందలేక పోయిన వారికి లబ్ది చేయాలని నిర్ణయం తీసుకున్నారు.