అంబానీ, ఆదానీల చూపు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు ఉందని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. అనకాపల్లి అచ్యుతాపురం సెజ్‌లో ఏటీసీ టైర్ల పరిశ్రమను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి వైపు వేగంగా అడుగులు పడుతున్నాయన్నారు.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మూడేళ్లుగా అవార్డు తీసుకుంటున్నాం. జపాన్ కంపెనీకి ప్రపంచంలోనే ఐదో స్థానం ఉంది. అలాంటిది 15 నెలల్లోనే ఏటీసీ టైర్ల పరిశ్రమను స్థాపించగలిగామని సగర్వంగా ప్రకటించారు. దేవుడి దయతో ఒక పరిశ్రమ…
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఏటీసీ టైర్ల పరిశ్రమను ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఇక, రెండో ఫేజ్ పనులకు ఇవాళ శంకుస్థాపన చేశారు.. సుమారు రూ.2,200 కోట్ల పెట్టుబడి అంచనాతో రెండు దశల్లో ఇది ఏర్పాటు కానుంది. తొలిదశలో రూ.1,384 కోట్లతో హఫ్ హైవే టైర్ల తయారీ యూనిట్‌లో ఇప్పటికే ప్రయోగాత్మకంగా టైర్ల ఉత్పత్తిని పరిశీలించిన ఏటీసీ నేటి నుంచి వాణిజ్యపరంగా కార్యకలాపాలు ప్రారంభించింది.. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కంపెనీ…
ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు.. కోస్తా, ఆంధ్ర, గోదావరి జోన్ల బీజేపీ పదాధికారుల సమావేశంలో సునీల్ ధియోధర్‌తో కలిసి పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.. అసలు వైసీపీ ప్రభుత్వం తోలు మందం ప్రభుత్వం.. బుర్రలేని ప్రభుత్వం అంటూ విమర్శలు గుప్పించారు.. నేచుర్ క్యూర్ ఆసుపత్రికి గత ప్రభుత్వం ఇచ్చిన భూమిని ఇళ్ళ పట్టాల పేరుతో ఈ ప్రభుత్వం నిర్వీర్యం…
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆ దిశగా చర్యలు చేపట్టాకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు.. రాజమండ్రిలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన… ఆజాదీ కా అమృత మహోత్సవాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొక్కుబడిగా నిర్వహిస్తోందన్నారు.. మహనీయులను స్మరించడం మానుకొని, సాంస్కృతిక శాఖ మంత్రి రోజా సొంత ప్రచారం చేసుకుంటున్నారు.. ఇప్పటికైనా మానుకోవాలని సూచించిన ఆయన.. అనవసరమైన వాటికి రాష్ట్ర ప్రభుత్వం దుబారా ఖర్చులు చేస్తోందని.. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి,…
గనన్న విద్యా దీవెన పథకం ద్వారా 694 కోట్ల రూపాయలు అక్క చెల్లెమ్మల అకౌంట్లలో వేస్తున్నామని తెలిపారు సీఎం జగన్.. రాఖీ పండుగ సందర్భంగా నా అక్క చెల్లెమ్మలకు అందిసున్న కానుక ఇది... మీ అన్నగా.. మీ తమ్ముడుగా నేను గర్వంగా చెబుతున్నా అన్నారు.
నేను పార్టీ మారుతున్నానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. ఆ దుష్ప్రచారాన్ని నమ్మొద్దు అని తెలిపారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి.. నెల్లూరు జిల్లా కోవూరులో గడప గడప కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్ విజయమ్మ తర్వాత వైసీపీలో ఎమ్మెల్యేను నేనే అన్నారు.. మంత్రి పదవి రాలేదనే అసంతృప్తితో నేను పార్టీ మారుతున్నాని కొందరు నాపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.. రాష్ట్రంలో నేను తిట్టినంతగా ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు…
జగనన్న విద్యా దీవెన నగదు విడుదల చేయడానికి సిద్ధమయ్యారు సీఎం వైఎస్ జగన్.. ఈ రోజు బాపట్లలో పర్యటించనున్న ఆయన.. జగనన్న విద్యా దీవెన మూడో త్రైమాసిక నగదు బదిలీ కార్యక్రమంలో పాల్గొంటారు..
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిందే తప్పు.. పైగా మళ్ళీ ఒక కులాన్ని దూషిస్తున్నాడని మండిపడ్డారు.. ఎంపీ పై చర్యలు తీసుకుకోకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుందని ఆరోపించారు టీడీపీ నేత యరపతినేని శ్రీనివాస్‌రావు.
సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఒకే రోజు హస్తినకు వెళ్లడం ఆసక్తికరంగా మారింది.. ఇప్పటికే చంద్రబాబు ఢిల్లీ చేరుకోగా.. రాత్రికి వైఎస్ జగన్ ఢిల్లీలో అడుగుపెట్టనున్నారు..