ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు.. రేపు ఆముదాలవలస వెళ్లనున్నారు.. స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడి వివాహానికి హాజరుకాబోతున్నారు. అయితే, సీఎం పర్యటన దృష్ట్యా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు.. 144 సెక్షన్ విధిస్తారని, కర్ఫ్యూ ప్రకటిస్తారనే ప్రచారం సాగింది.. ఆ వార్తలపై స్పందించిన స్పీకర్ తమ్మినేని సీతారాం.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆముదాలవలసకు రేపు 3.20 గంటలకు వస్తారు.. 10 నిమిషాల పాటు ప్రజలతో మమేకం అవుతారని.. సాయంత్రం 4.15 గంటల…
‘జగనన్న తోడు’ పథకం కింద వడ్డీ లేని రుణాలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమచేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. 3.95 లక్షల మందికి ఈ పథకం ద్వారా కొత్తగా రూ.395 కోట్ల వడ్డీ లేని రుణాలను సమకూర్చడంతోపాటు గత ఆర్నెల్లకు సంబంధించి రూ.15.96 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ను కూడా జమ చేశారు.. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. చిరు వ్యాపారులకు, హస్త కళాకారులకు రూ. 10వేల చొప్పున వడ్డీలేని రుణాల పథకం అమలు చేస్తున్నామని…
ఇక, కోనసీమ జిల్లా పేరు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చింది ప్రభుత్వం.. దీనికి సంబంధించిన తుది గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది ప్రభుత్వం.. మే 18న దీనికి సంబంధించిన ప్రాథమిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం, జూన్ 24న రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.. ఇప్పుడు ఫైనల్ గెజిట్ నోటిఫికేషన్ తో ఇక నుంచి డా బీఆర్ అంబేద్కర్ కోనసీమగా జిల్లాగా మార్చేసింది.. కాగా, ఇటీవల జిల్లాల పునర్‌వ్యస్థీకరణలో అమలాపురం పార్లమెంటు…
వ్యవసాయ మోటార్లకు మీటర్లపై రైతులకు లేఖలు రాయాలని సూచించారు సీఎం జగన్.. ఆ లేఖల్లో వ్యవసాయ మెటార్లకు మీటర్లు పెట్టడం వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు పేర్కొనాలని ఆదేశించారు.
ఏళ్లు గడుస్తున్నా విభజన హామీలు అమలు కావడం లేదు.. ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రులను, అధికారులను తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, మంత్రులు.. అధికారులు వివిధ సందర్భాల్లో కలిసి విజ్ఞప్తి చేస్తున్నా.. అమలుకు నోచుకోవడం లేదు.. అయితే, ఈ వ్యవహారంలో ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి… మేం కేంద్రంపై ఒత్తిడి మాత్రమే చేయగలం అని వ్యాఖ్యానించారు.. విభజన చట్టంలోని చాలా హామీలు అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన..…