జాతీయ పతాక రూపకర్త స్వర్గీయ పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి కన్నుమూశారు.. ఆమె వయస్సు వందేళ్లు.. ప్రస్తుత పల్నాడు జిల్లా మాచర్లలోని ప్రియదర్శిని కాలనీ నివాసం ఉంటున్న ఆమె.. గురువారం రాత్రి ప్రాణాలు విడిచారు.. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు.. అయితే, సీతామహాలక్ష్మీ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఆమె అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కాగా, జాతీయ జెండా రూపొందించి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా గతేడాదిలో సీఎం వైఎస్ జగన్ స్వయంగా మాచర్ల వెళ్లారు.. సీతామహాలక్ష్మిని కలిసి సత్కరించారు.. ఆమెతో ముచ్చటించారు. అలాగే ప్రభుత్వం తరపున ఆమెకు రూ.75 లక్షల చెక్కును కూడా అందజేసిన విషయం తెలిసిందే.. ఆజాదికా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా మరోసారి సీతామహాలక్ష్మి ఆగస్టు 2వ తేదీన సత్కారం అందుకోవాల్సి ఉండగా.. గురువారం రోజు కన్నుమూశారు సీతామహాలక్ష్మి.
Read Also: Harassment: స్కూల్ పిల్లలపై లైంగిక దాడి.. న్యూడ్ వీడియోలు చిత్రీకరించి మరీ..