తమిళనాడులో సీఎం స్టాలిన్ అధికారం చేపట్టి ఏడాది పూర్తవుతోంది. గత ఏడాది మే 7న డీఎంకే పార్టీ అధికారంలోకి వచ్చింది. దాదాపు పదేళ్ల తర్వాత తమిళనాడులో డీఎంకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో సీఎం స్టాలిన్ ప్రభుత్వ బస్సులో ప్రయాణించారు. మెరీనా బీచ్‌లో ఉన్న తన తండ్రి కరుణానిధి స్మారక చిహ్నం అన్నా మెమోరియల్‌కు బస్సులో వెళ్తూ ప్రయాణికులు, కండక్టర్‌తో ముచ్చటించారు. డీఎంకే పాలన ఎలా ఉందని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. స్టాలిన్ స్వయంగా…
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో ప్రజలు నరకం చూస్తున్నారు.. కొనే పరిస్థితి లేదు.. అమ్మడానికి కూడా ఏమీ లేదు అనే తరహాలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి.. ఇప్పటికే శ్రీలంకకు భారత్ భారీ సాయం చేయగా.. ఇప్పుడు.. శ్రీలంకలోని తమిళులకు సాయం చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం సిద్ధమైంది. తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ తరపున కోటి రూపాయలు విరాళంగా ఇవ్వనున్నారు.. ప్రభుత్వం తరపున మొదటి విడతగా 40 వేల టన్నుల బియ్యం, 500 టన్నుల మిల్క్ పౌడర్,…
తమిళనాడులో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అక్కడ మరికొద్దిరోజుల్లో కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా సీఎం స్టాలిన్ కుమారుడు, డీఎంకే యువజన విభాగం కార్యదర్శి, యువ హీరో ఉదయనిధి స్టాలిన్ కేబినెట్‌లోకి రాబోతున్నారని జోరుగా ప్రచారం నడుస్తోంది. ఈ యువ నాయకుడికి సన్నిహితంగా ఉన్న కొందరు డీఎంకే నేతలు ఈ వార్తలు నిజమే అని ధృవీకరిస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్ ఇప్పటికే ప్రజాదరణ పొందారని.. చాలామంది మంత్రులు తమ కార్యక్రమాల్లో ఆయనతో వేదిక పంచుకోవాలని కోరుకుంటున్నారని…
తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూనివర్సిటీల వైస్ ఛాన్సిలర్ల నియామకంలో రాష్ట్ర గవర్నర్‌కు ఉన్న అధికారాలను తొలగించేలా స్టాలిన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో యూనివర్సిటీల వీసీలను ప్రభుత్వమే నియమించేలా చట్టంలో సవరణలు చేస్తూ అసెంబ్లీలో కొత్త బిల్లును తీసుకొచ్చింది. ఈ మేరకు తమిళనాడు విద్యాశాఖ మంత్రి పొన్ముడి సోమవారం నాడు అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లును అన్నాడీఎంకే, బీజేపీ వ్యతిరేకించగా.. పీఎంకే పార్టీ సమర్థించింది. ఈ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా అసెంబ్లీలో…
తమ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న ఓ వ్యక్తి.. బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేశారు.. దాని కోసం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కూడా కలిశారు.. దీంతో.. పార్టీ అతనపై వేటు వేయగా.. సొంత నియోజకవర్గంలో నిరసన సెగలు తగిలాయి.. దీంతో.. కొంత కాలం సైలెంట్‌గా ఉన్న ఆ నేత.. ఇప్పుడు మళ్లీ సొంత గూటికి చేరారు.. అయితే.. థౌజండ్ లైట్స్ మాజీ ఎమ్మెల్యే సెల్వం.. గతంలో డీఎంకే ఎమ్మెల్యేగా వ్యవహరించిన ఆయన.. 2020 ఆగస్టు 4వ…
కరోనా నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో నిర్వహించే జల్లికట్టుకు అనుమతిస్తూ సీఎం స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. కరోనా నెగిటివ్ వచ్చిన వారినే అనుమతించాలని, తక్కువ సంఖ్యలో ప్రేక్షకులకు అనుమతి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని సీఎం స్టాలిన్ సూచించారు. Read Also: రూల్స్ బ్రేక్ చేస్తున్న ప్రజాప్రతినిధులు కాగా సంక్రాంతి పండుగలో ఎద్దులను మచ్చిక చేసుకుని లొంగదీసుకునే ఆటే జల్లికట్టు. ఇందుకోసం…
సౌతాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ కేసులు క్రమంగా ఇతర దేశాలకు వ్యాపిస్తూనే ఉన్నాయి.. భారత్‌లోని పలు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు టెన్షన్ పెడుతున్నాయి.. అప్రమత్తమైన పలు రాష్ట్రాలు ఇప్పటికే ఆంక్షల బాట పడుతున్నాయి.. ఇక, తమిళనాడులో ఇప్పటికే 120కి పైగా ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి.. దీంతో.. ఆ రాష్ట్రం కూడా కఠిన ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయానికి వచ్చింది.. Read Also: ఒమిక్రాన్ వెలుగుచూసిన చోట ఆంక్షలు ఎత్తివేత.. ఇవాళ్టి నుంచి కఠిన ఆంక్షలు అమలు చేయాలని…
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు ప్రమాదాలకు గురైన వారిని కాపాడుకునేందుకు కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. ఇన్నుయిర్ కాప్పొమ్ పేరుతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం ప్రకారం, రోడ్డు ప్రమాదం జరిగిన తరువాత వెంటనే వారిని ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్యం అందించాలని, రోడ్డు ప్రమాదం బారిన పడిన వ్యక్తిని కాపాడేందుకు మొదటి 48 గంటలకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని స్టాలిన్ పేర్కొన్నారు. Read: ముంబైలో కాంగ్రెస్ సభపై నీలిమేఘాలు……
తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి ఫెడరల్ ఫ్రంట్ కోసం ప్రయత్నాలు మొదలు పెడుతున్నారా? తమిళనాడు సీఎం స్టాలిన్‌తో భేటీలో ప్రాంతీయ పార్టీల కూటమి గురించే చర్చించారా? ఇకపైనా ఇదే దూకుడు కొనసాగిస్తారా? ఫెడరల్ ఫ్రంట్‌కు రూపు తీసుకొస్తారా? ఆ మధ్య శివసేన, ఎన్సీపీలతో మమత చర్చలు..! 2024 సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల ముందే జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. బెంగాల్లో మూడోసారి అధికారంలోకి వచ్చాక ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ జాతీయ…
సీడీఎస్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిన ఘటన దేశవ్యాప్తంగా విషాదం నింపింది. ఈ ప్రమాదం జరిగే సమయంలో అక్కడ వున్న ప్రత్యక్ష సాక్షి అసలేం జరిగిందో వివరించే ప్రయత్నం చేశారు. హెలికాప్టర్ కూలే సమయంలో భారీ శబ్దం వచ్చింది. వెంటనే వెళ్ళి అక్కడ చూస్తే భారీ మంటలతో కూడిన పొగ వచ్చింది. ఈ విషయాన్ని వెంటనే పోలీసులు కు చెప్పామన్నారు ప్రత్యక్ష సాక్షి. హెలికాప్టర్ కూలిన ప్రదేశం నుండి వంద మీటర్ల దూరంలోనే స్థానికులు ఉంటున్నారు.…